- District News
- Warangal
- చినుకు పడితే చిత్తడవుతున్న హనుమకొండ చౌరస్తా
చినుకు పడితే చిత్తడవుతున్న హనుమకొండ చౌరస్తా
హనుమకొండ లో పాలకుల నిర్లక్ష్యంపై బీజేపీ పశ్చిమ నియోజకవర్గ కాంటెస్ట్ అభ్యర్థి రావు పద్మారెడ్డి ఆగ్రహం.
మాటలు తప్ప చేతాల్లొ లేని స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్14
(లోకల్ గైడ్ న్యూస్)
మండిపడ్డారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మాటలు చెప్పడంపై ఉన్న శ్రద్ధ, నగరాభివృద్ధిపై లేదని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం శూన్యమని విమర్శించారు.ప్రస్తుతం చిన్నపాటి వర్షం కురిసినా చౌరస్తాలన్నీ చెరువులను తలపిస్తూ జలమయమవుతున్నాయి. హనుమకొండ నగరంలో సరైన డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం, ఉన్న డ్రైనేజీలు సైతం సకాలంలో పూడికతీతకు నోచుకోకపోవడం వల్లే వర్షపు నీరంతా రోడ్లపైకి వస్తోందని ఆమె ఆరోపించారు. దీనివల్ల నిత్యం వేలాది మంది వాహనదారులు, పాదచారులు నరకయాతన అనుభవిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డుపై గుంతలు ఎక్కడున్నాయో తెలియక ద్విచక్ర వాహనదారులు, ఆటో ప్రయాణికులు, కాలినడకన వెల్లే ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు .వర్షపు నీరు గుంతలలో చుట్టు చేరుతుండటంతో చిరు వ్యాపారులు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నగరంలో నెలకొన్న ఈ రోడ్ల దుస్థితి, డ్రైనేజీ సమస్యల పై ఎలాంటి చలనం లేకపోవడం విచారకరమన్నారు.పాలకుల బాధ్యతారాహిత్యం వల్లే సామాన్య ప్రజలు ఇన్ని అవస్థలు పడాల్సి వస్తోందని స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారని రావు పద్మారెడ్డి గుర్తు చేశారు. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్, స్థానిక అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి, చౌరస్తాలో నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
రాబోయే రోజుల్లో శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి, గుంతలమయమైన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. పాలకులలో ఇప్పటికైనా చలనం రాకపోతే, హనుమకొండ నగర ప్రజలను, బీజేపీ శ్రేణులను సమీకరించి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, చేపడతామని రావు పద్మారెడ్డి హెచ్చరించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
14 Sep 2026 19:49:54
గణేష్ ప్రతిష్టలో ఇరువర్గాల మధ్య ఘర్షణ -పోలీసుల రంగ ప్రవేశం. సంఘటన పై భక్తుల అసంతృప్తి.
