- District News
- ఆదివాసీ నర్సు శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి
ఆదివాసీ నర్సు శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి
చర్ల మండల బీజేపీ అధ్యక్షులు నూప రమేష్ డిమాండ్
Published On
By Ram Reddy
తుక్కుగూడలో ఆదివాసీ నర్సు ఊకె శిరీష మృతి ఘటనపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చర్ల మండల బీజేపీ అధ్యక్షులు నూప రమేష్ డిమాండ్ చేశారు. నేరం రుజువైతే నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా వెళ్లే మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని, ప్రైవేట్ ఆసుపత్రులు, సంస్థల్లో పనిచేస్తున్న మహిళల భద్రతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక, న్యాయ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్ బాబా పాహీం, జిల్లా కార్యవర్గ సభ్యులు గునురి రమణ, మండల ప్రధాన కార్యదర్శి బి. సందీప్, యువ మోర్చా అధ్యక్షులు పి. వినయ్, మండల కార్యదర్శులు ముత్తవరపు శ్రీనివాస్ చారి, విశ్వనాథ, కుప్పా మాధవరావు, ఇర్ప సుబ్బారావు, సుక్క శివ, సంతపూర్ సతీష్, యూక రాంబాబు, కే. శివ, సుక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
13 Sep 2026 21:02:56
గ్రామ కమిటీ అధ్యక్షులుగా జె హిరు నాయక్ ఎంపిక...
మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు నర్సింలు గౌడ్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు...
