శ్రీశైలంలో సమృద్ధిగా నీళ్లు .

వ్యవసాయ రంగానికి  సాగు నీరు  అందించలేని అసమర్థ ప్రభుత్వం. --- రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీపై ఉన్న ద్యాస రైతులపై లేదు. ----- కెఎల్ఐ పంపులు 24గంటలు నడపాలి.

అంతరాయం లేని కరెంట్ ఇవ్వాలి.              ---మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి డిమాండ్. 
Published On
శ్రీశైలంలో సమృద్ధిగా నీళ్లు .

శ్రీశైలంలో సమృద్ధిగా నీళ్లు ఉన్నప్పటికి  వ్యవసాయ రంగానికి  సాగు నీరు  అందించలేని అసమర్థ ప్రభుత్వమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. శుక్ర వారం  రేవల్లి మండలం గౌరీదేవిపల్లి వద్ద మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం స్టేజ్ - 3 పంప్ హౌస్ ను జిల్లా  బీ ఆర్ ఎస్  మాజీ మం త్రుల, మాజీ ఎమ్మెల్యేల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టులో సమృద్ధిగా నీళ్లు ఉన్నా సాగుజాలలు అందించలేని అసమర్థ రేవంత్ రెడ్డి ప్రభుత్వమని ఆయన  ద్వజమెత్తారు. ఎదేచ్ఛగా ఆంధ్రా ప్రభుత్వం నీళ్లను తరలిస్తుంటే, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్థూ ఉమ్మడి పాలమూరు రైతులను హరిగోస పడుతుందన్నారు . కెఎల్ ఐ పంపులు 24గంటలు నడిపి రైతులకు సాగు జలాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వానాకాలం సీజన్ మొదలైన్నప్పటి  నుంచి ప్రభుత్వాన్ని అలెర్ట్ అప్రమత్తం చేస్తున్నామని ఆయన  చెప్పారు. ఎగువ నుంచి వరద నీరు వచ్చిన ఉపయోగించుకోలేని స్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉందన్నారు.   శ్రీశైలం లో  నీరు సమృద్దిగా ఉన్నప్పటికి ఉపయోగించుకో వడంలేదని, పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్ర కు  నీళ్ళు తరలించుకు పోతున్న పట్టించుకోవడం లేదన్నారు. 
రోజుకు పది నుంచి పన్నెండు టీ ఏం సీ ల నీళ్ళు ఏపీ తీసుకెళ్తుందని, తెలంగాణ రెండు వందల రోజులు పంప్ లు నడిపితే 40 టీ ఏం సి నీళ్ళు మాత్రమే తీసుకోగలదని ఆయన చెప్పారు. కల్వకుర్తి పంప్ లు ఐదు కలిపితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో ఒక్క మోటర్ తో సమానమని, అటువంటి పంప్ లు పది పెట్టారని ఆయన చెప్పారు. ఉన్న నీళ్ళు తెలివిగా వాడుకోవడం ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. 
శ్రీశైలం లో  ఉన్న నీళ్ళు యాసంగి పంటకు కూడా ఇవ్వొచ్చున్నారు. ఫ్యూచర్ సిటీ,అన్నదమ్ముల దందా మీద వున్న శ్రద్ధ రైతులకు నీళ్ళు ఇవ్వడంలో ముఖ్య మంత్రి కి  లేదన్నారు. 


---- పంటలు ఎండిపోతే ప్రభుత్వానిదే బాధ్యత...

------ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ....
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు చేసిన పంట లు  ఎండిపోతే ప్రభుత్వానిదే బాధ్యత అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆంధ్రాకు నీళ్ళు తరలి పోతున్నాయని, తెలంగాణకు మాత్రం నీళ్ళు రావడంలేదని ఆయన  ఆవేదన వ్యక్తం చేశారు. 
ఆంధ్రా వాళ్లు అనధికారికంగా నీళ్ళు తరలించు కుపోతుంటే సీఎం,జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారని ఆయన  ప్రశ్నించారు. కరెంట్ కొరత  సాకుతో ఏపీ జల దోపిడీకి సహకరిస్తున్నారని ఆయన  చెప్పారు. ఈ పరిస్థితుల్లో పాలమూరు ఎడారి కాకుండా కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. 

------రైతులకు నీళ్ళు ఇచ్చే సోయి ప్రభుత్వానికి లేదు...

----- మాజీ మంత్రి లక్ష్మారెడ్డి....

రైతులకు సాగు నీరు ఇచ్చే సోయి కాంగ్రేస్ ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ప్రభుత్వం అప్రమత్తం  అవుతుందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగడం లేదన్నారు. కేసీఆర్ గారి హాయాంలో వరద వచ్చే ముందే  అలెర్ట్ చేసేవారని ఆయన  చెప్పారు. 
నీళ్ళు వచ్చినా లిఫ్ట్ చేయకుండా ప్రభుత్వం ఆలస్యం చేసిందన్నారు . మేము ఇక్కడి వస్తే మోటర్లు ఆన్ చేశారని రైతులు చెప్తున్నారని ఆయన  తెలిపారు. 
 వానాకాలం సాగు మీద ప్రభుత్వానికి స్పష్టమైన   ప్రణాళిక ఇవ్వలేదన్నారు. దీంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారని ఆయన  చెప్పారు. 
రైతులకు సాగు నీళ్లు ఇచ్చే వరకు అండగా ఉంటామన్నారు. రైతుల సంక్షేమం, శ్రేయస్సు మాకు ముఖ్యమన్నారు.వ్యవసాయానికి  మోటర్లు ఆపకుండా నడపాలని,  విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు.
మోటర్లు ఆన్ చేయకుంటే పంప్ హౌస్ ల వద్ద టెంట్ వేసుకొని కూర్చుంటామని ఆయన హెచ్చరించారు. వారితో పాటు మాజీ ఎమ్మెల్యే లు మర్రి జనార్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలు మాట్లాడారు. ఈ కార్య క్రమంలో నందిమల్ల అశోక్,చిట్యాల రాము తదితరులు ఉన్నారు .

Tags:

About The Author

Latest News

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.  జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఎన్ బి డబ్ల్యు పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి
గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వినాయక చవితి ముందస్తు వేడుకలు
26వ రోజుకు చేరిన పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం
ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి
లోకపల్లిలో జనజాతర
పేదలపై నిర్లక్ష్యం.. హామీలు బేఖాతర్!
రోడ్డు మరమ్మత్తుల పనులను చేపట్టండి