సిద్దిపేట, సెప్టెంబర్ 9( లోకల్ గైడ్):
సిద్దిపేటలోని బీడీకే ఆర్‌అండ్‌బీ కార్యాలయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి.హెచ్. ధనరాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.రక్త నమూనాలను ఎప్పటికప్పుడు సేకరించి, సకాలంలో నిర్ధారణ జరిగేలా టి-హబ్‌కు వీలైనంత త్వరగా తరలించాలని సూచించారు. ఆరోగ్య కార్యక్రమాల పనితీరును మెరుగుపరచడంతో పాటు ఓపీ సంఖ్యను పెంచాలని, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయించాలని ఆదేశించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలనిసూచించారు.అనంతరం ఎన్‌ఎఫ్‌సీపీ ఫైలేరియా యూనిట్‌ను సందర్శించిన డీఎంహెచ్‌ఓ రికార్డులను పరిశీలించారు. అనుమానిత కేసులను సమర్థవంతంగా స్క్రీనింగ్ చేసి, వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే చికిత్స అందించాలని సూచించారు. గుర్తించిన కేసులపై క్రమం తప్పకుండా ఫాలోఅప్ నిర్వహించాలని ఆదేశించారు. సకాలంలో వైద్య సేవలు అందించడం, కేసులను నిరంతరం పర్యవేక్షించడం ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీకాంత్, వైద్యాధికారి డాక్టర్ ఆడిబ ఫర్హాత్, చక్రధర్ హెచ్‌ఈఓ, వైద్య సిబ్బంది, ఫైలేరియా సిబ్బంది ప్రసాద్ హెచ్‌ఎస్, హెచ్‌ఏ రాజు తదితరులు పాల్గొన్నారు.