ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం

Published On
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలంగాణ మాండలిక భాషా దినోత్సవం

 

భద్రాచలం,  భద్రాద్రి జిల్లా బ్యూరో (లోకల్ గైడ్ న్యూస్) : భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తిలో తెలుగు, సాహితీ విభాగాల ఆధ్వర్యంలో ప్రజాకవి ఆచార్య కాళోజి నారాయణరావు 113వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధానాచార్యులు ప్రొఫెసర్ జాన్ మిల్టన్ మాట్లాడుతూ సాహిత్యం మనిషిలో సామాజిక స్పృహతో పాటు మానసిక ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో పలువురు కవులు రచనలు చేశారని, వారిలో కాళోజి ప్రముఖులని తెలిపారు. కాళోజి ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్ శ్రీమతి హవేల, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కపిలభారతి, తెలుగు విభాగాధిపతి నండూరి రాంబాబు, సుబ్బరాజు, శ్రీను, కన్వీనర్లు డాక్టర్ సుధాకర్, డాక్టర్ కిరణ్, డాక్టర్ నాగ సమీరా, గణిత విభాగాధిపతి శ్రీమతి శ్రీలతతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News