- District News
- గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి.
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి.
పెద్దేముల్ మండల ఎస్సై ప్రశాంత్ వర్ధన్
లోకల్ గైడ్/తాండూర్:
రాబోయే గణేష్ ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని పెద్దేముల్ మండల ఎస్సై ప్రశాంత్ వర్ధన్ సూచించారు. ఈ మేరకు మండల పరిధిలోని ఆయా గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులతో బుధవారం శాంతి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై ప్రశాంత్ వర్ధన్ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు, ప్రజాశాంతికి విఘాతం కలగకుండా గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా అధిక శబ్దాలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకోవాలని, మండపాల వద్ద తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
అనంతరం గ్రామ సర్పంచ్ డీవై నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు ప్రవీణ్‌కుమార్, ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. పరిధికి మించి ఎత్తు ఉన్న వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని సూచించారు. నిమజ్జనం రోజున మద్యం సేవించకుండా భక్తిశ్రద్ధలతో భజనలు, కీర్తనలతో శోభాయాత్ర నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నసీర్, రాము నాయక్ , ఆయా శాఖల అధికారులు,ఆయా గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులు, పోలీసు సిబ్బంది, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.
