ఎస్ఐఆర్ ధ్రువపత్రాల పరిశీలన త్వరగా పూర్తి చేయాలి 

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

Published On
ఎస్ఐఆర్ ధ్రువపత్రాల పరిశీలన త్వరగా పూర్తి చేయాలి 

 

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026లో మ్యాపింగ్ కాని,అనామలిస్ జాబితాలో ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఓటర్లు అందిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.బుధవారం జిల్లాలోని జైపూర్ మండలం నర్వ గ్రామంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో నోటీసుల జారీ,విచారణ ప్రక్రియలను వేగవంతం చేసి నిర్ణీత గడువుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అర్హత గల ప్రతి ఒక్క ఓటరు వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు ప్రక్రియ నిర్వహించాలని,బూత్ స్థాయి అధికారులు,బూత్ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో ఓటర్లకు అవగాహన కల్పించి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.మండలంలోని టేకుమట్ల గ్రామంలో తహసిల్దార్ వనజా రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీపతి బాబు లతో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.కుందారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తహసిల్దార్ తో కలిసి సందర్శించి తరగతి గదులు,మధ్యాహ్న భోజన నాణ్యత,పరిసరాలను పరిశీలించారు.విద్యారంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని,ఈ క్రమంలో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్య అందించాలని,మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.అనంతరం వేలాల గ్రామంలో ఇసుక రీచ్ నుండి ఎస్.ఎస్.ఎం.ఎం.ఎస్.వెబ్ సైట్ ద్వారా చేపడుతున్న ఇసుక సరఫరా ప్రక్రియను పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.ఇసుకను పారదర్శకంగా,అధికారికంగా అందించడం జరుగుతుందని తెలిపారు.ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారులకు బుకింగ్ ప్రకారం నిర్ణీత గడువులోగా సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షించాలని, ఇసుకను అక్రమంగా రవాణా చేసినా,నిల్వ ఉంచినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి


ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 27న జిల్లాలలో వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ అన్నారు.బుధవారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు,అదనపు కలెక్టర్లు,అటవీ,ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలలో పర్యాటక రంగ అభివృద్ధికి జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమించి,వివిధ శాఖల సమన్వయంతో పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలని తెలిపారు.ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకొని ఆకర్షణీయమైన కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు.యువతలో పర్యాటక రంగంపై ఆసక్తిని పెంపొందించి,జిల్లాలలో పర్యాటక ప్రదేశాల ప్రచారం,అభివృద్ధి కోసం ఆసక్తి కలిగిన యువతను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని,పర్యాటక ప్రాంతాలను ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య,జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్,ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News