రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి.

Published On
రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి.

 

 

హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 09
(లోకల్ గైడ్ న్యూస్)

హనుమకొండ,రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వరంగల్,హనుమకొండ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మిల్లర్లు కలెక్టర్‌ లకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ, మిల్లింగ్ ప్రక్రియకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. మిల్లింగ్ సమయంలో డ్యామేజ్, నూకలు తదితర కారణాలతో ఏర్పడే షార్ట్‌ఫాల్‌పై మిల్లర్లపై చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే రబీ 2025-26 సీజన్‌కు సంబంధించిన బాయిల్డ్ రైస్, రా రైస్ డెలివరీ సమస్యలను పరిష్కరించాలని, ఓటిఆర్, టెస్ట్ మిల్లింగ్‌కు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. గత సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్, డ్రెయిజ్, కస్టోడియన్, రవాణా చార్జీలను కూడా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి, త్వరితగతిన పరిష్కారం చూపాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లర్ల సమస్యల పరిష్కారం కోసం అసోసియేషన్ ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో హనుమకొండలో జాయింట్ కలెక్టర్‌కు సమర్పించిన ఈ వినతిపత్రం ప్రాధాన్యత సంతరించుకుంది అన్నారు.

Tags:

About The Author

Latest News