తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెట్టొద్దు.. జీఆర్‌ఎంబీ సమావేశాన్ని బహిష్కరించాలి.

జీఆర్‌ఎంబీ సమావేశానికి హాజరైతే తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టినట్లే: పోచబోయిన శ్రీహరి యాదవ్

Published On
తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెట్టొద్దు.. జీఆర్‌ఎంబీ సమావేశాన్ని బహిష్కరించాలి.

సిద్దిపేట, ఆగస్టు 8(లోకల్ గైడ్):

తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం ఎజెండాలో తెలంగాణకు సంబంధించిన ఏడు ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాలను చేర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని పోచబోయిన శ్రీహరి యాదవ్ డిమాండ్ చేశారు.శనివారం సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు క్యాంపు కార్యాలయంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కొండం రవీందర్ రెడ్డి, మేడికాయల వెంకటేశం, కీసర పాపయ్య తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. గోదావరి నదీ చరిత్రలో ఇప్పటివరకు లేని విధంగా ఇప్పటికే పొందిన అనుమతులకు సంబంధించిన అంశాలను జీఆర్‌ఎంబీ సమావేశం ఎజెండాలో చేర్చడం ఆందోళనకరమన్నారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడమేనని విమర్శించారు.తెలంగాణకు కేటాయించిన నీటి వాటా, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కోరారు. తెలంగాణకు ఉపయోగపడే ఏడు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు జీఆర్‌ఎంబీ ఎజెండాలోకి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు."ఎత్తిపోతల పథకాలే తెలంగాణకు జీవనాడి" తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల ద్వారానే రాష్ట్రానికి నీటి భద్రత సాధ్యమవుతుందని శ్రీహరి యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. నీటి వాటా, సాగునీరు, తాగునీటి విషయంలో ఎలాంటి రాజీకి తావివ్వకూడదన్నారు.రాష్ట్ర ప్రయోజనాల కంటే ఇతర రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన ప్రజల్లో కలగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.ఎజెండా నుంచి తొలగించిన తర్వాతే సమావేశానికి వెళ్లాలిజీఆర్‌ఎంబీ సమావేశం ఎజెండాలో ఉన్న తెలంగాణకు సంబంధించిన ఏడు ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాలను ముందుగా తొలగించాలని శ్రీహరి యాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమైన అంశాలను ఎజెండాలో ఉంచి సమావేశానికి హాజరు కావడం సరికాదన్నారు.“ముందుగా ఏడు ప్రాజెక్టుల రద్దు అంశాలను ఎజెండా నుంచి తొలగించాలి. లేకపోతే తెలంగాణ ప్రభుత్వం జీఆర్‌ఎంబీ సమావేశాన్ని బహిష్కరించాలి. తెలంగాణ హక్కులు, నీటి వాటా విషయంలో ఎలాంటి రాజీకి తావివ్వకూడదు” అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కొండం రవీందర్ రెడ్డి, మేడికాయల వెంకటేశం, కీసర పాపయ్య, రేగుల దేవయ్య, సతీష్ రామచంద్ర, రమేష్, బెజ్జంకి బిక్షపతి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...