రోడ్డు ప్రమాదంలో సీనియర్ నేత నర్సింహారెడ్డి మృతి

అఖిల పక్షాల దిగ్రాంతి

ప్రగాఢ సంతాపం
Published On
రోడ్డు ప్రమాదంలో సీనియర్ నేత నర్సింహారెడ్డి మృతి

నారాయణపేట ఆగస్టు 8:
ఉమ్మడి మక్తల్ నియోజక వర్గం సీనియర్ రాజకీయ నేత మాగనూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  నరసింహారెడ్డి శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమా దంలో మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మాగనూ రుకు వెళ్లి నరసింహారెడ్డి  భౌతికకాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, వారికి ధైర్యంచెప్పారు.నర్సింహారెడ్డి ఉమ్మడి మక్తల్ నియోజ క వర్గంలో మాజీ మంత్రి ఎల్కోటి ఎల్లారెడ్డి ప్రియ శిష్యునిగా ఉంటూ జిల్లా పరిషత్ సభ్యునిగా పని చేశారు. ఏ కష్టం వచ్చిన నేను ఉన్నానంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ జన నాయకునిగా అందరి మనసుదోచుకున్నారు.అన్ని పార్టీల నాయకులతో సంబంధాలు నేర్పుతూ అందరి వాడుగా ఎదిగా రు.అంత్య క్రియలకు బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకు లు కొండయ్య,బి ఆర్ ఎస్ నాయకులు ఆశిరెడ్డి, ఉమ్మడి నియోజక వర్గం లోనిమక్తల్,మాగనూర్, నర్వ,ఉట్కూర్ మండలా ల నుంచి నాయకులు తరలి వచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు తదితరులు పాల్గొనీ అంతిమ వీడ్కోలు పలికారు.
ఫోటో రైట్ అప్:1.రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నర్సింహ రెడ్డి,2.నివాళి అర్పించిన మంత్రి శ్రీహరి 
____________________

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...