- District News
- Warangal
- మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లాకు రానున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లాకు రానున్నారు.
నర్సంపేట నియోజకవర్గంలోని దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు08
(లోకల్ గైడ్ న్యూస్)*:
పెద్ది సుదర్శన్ కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థికసాయం..!! పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ అండగా నిలవాలని నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆయన కుటుంబానికి పార్టీ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయించారు. సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలు, మొత్తంగా రూ.2.25 కోట్లు ఇవ్వాలని, ఈ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పిల్లల భవిష్యత్తు, చదువు, కుటుంబ సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉంటుందని కేసీఆర్ భరోసానిచ్చారు.
Tags:
About The Author
Related Posts
Latest News
22 Aug 2026 21:30:17
లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
