- District News
- Khammam
- గాదెపాడులో ఘనంగా అన్నదానం
గాదెపాడులో ఘనంగా అన్నదానం
భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 22 (లోకల్ గైడ్ న్యూస్) : కారేపల్లి మండలం గాదెపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మంగళవారం సాయంత్రం శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పం
చ్ భూక్యా రంజిత్ కుమార్ పాల్గొని భక్తులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ భూక్యా రంజిత్ కుమార్ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులకు సూచనలు, సలహాలు అందిస్తూ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిర్వాహకులకు సహకరించారు. అన్నదాన కార్యక్రమానికి ఉపసర్పంచ్ నన్నెబోయిన ఉపేందర్, గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
