- District News
- Warangal
- హనుమకొండలో14 రాష్ట్రాల చేనేత కళా వైభవం ఒకే వేదిక పై
హనుమకొండలో14 రాష్ట్రాల చేనేత కళా వైభవం ఒకే వేదిక పై
ఇండియన్ సిల్క్ గ్యాలరీ ని ప్రారంభించిన గుండు సుధారాణి
Published On
By Ram Reddy
హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్24
(లోకల్ గైడ్ న్యూస్)
ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్‌పో ఈ నెల 24వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు 5 రోజుల పాటు అలరిస్తుందని ఎక్స్‌పో నిర్వాహకులు శ్రీనివాసరావు తెలిపారు. చందేరి, మహేశ్వరి, కోట, రాజ్‌కోట్ పటోలా ఇలా వివిధ ప్రాంతాల ప్రత్యేక డిజైన్ల చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ప్రజలకు అందుబాటులో ఉంటుందని, కుటుంబ సమేతంగా వచ్చి భారతీయ చేనేత, పట్టు వస్త్రాల వైవిధ్యాన్ని వీక్షించి నచ్చిన వస్త్రాలను కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. వివాహాలు, శుభకార్యాలు, పండుగలు, ప్రత్యేక సందర్భాలకు అనువైన పట్టు చీరలు, చేనేత వస్త్రాలు, డ్రెస్సు మెటీరియల్స్, తదితర ఉత్పత్తులు విస్తృతంగా ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. అన్ని వస్త్రాలను నేరుగా నేత కళాకారులు, సహకార సంఘాలు, ప్రామాణిక తయారీదారులే ప్రదర్శిస్తుండటం వల్ల నాణ్యతతో పాటు సరసమైన ధరల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వినియోగదారులు స్వచ్ఛమైన పట్టు వస్త్రాలను నమ్మకంగా కొనుగోలు చేసే అవకాశం కలుగుతుందని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విభాగం టీపీసీసీ చేనేత విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, పద్మశాలి సంఘం నాయకుడు వైద్యం రాజగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
05 Oct 2026 20:48:32
ఏర్పాట్లను పరిశీలించిన యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ఇనపనూరి ప్రభాకర్
