- District News
- Khammam
- గోపాలపురం తండాలో ఘనంగా అన్నదానం
గోపాలపురం తండాలో ఘనంగా అన్నదానం
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు అంతోటి అచ్చయ్య
కామేపల్లి, సెప్టెంబర్ 22 (లోకల్ గైడ్ న్యూస్) :
కామేపల్లి మండలం గోపాలపురం తండాలో వినాయకుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అజ్మీర కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు అంతోటి అచ్చయ్య హాజరై భక్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అచ్చయ్య మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఐకమత్యంతో నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ద్వారా భక్తులకు సేవ చేసే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.
ఈ అన్నదాన కార్యక్రమానికి తండా ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కన్నమాల రాంబాబు, గునిగంటి వెంకటేశ్వర్లు, వినయ్, మధు, అజ్మీరా కుమారి, లకావత్ రాంబాబు, అజ్మీరా రవికుమార్, భూక్యా కిషన్, బోడ శంకర్, కేశగాని రాఘవ, గుగులోత్ వీరన్న, లకావత్ బొజ్జ, సంతోష్, నవీన్, తేజావత్ రమేష్, కొర్ర కిషన్, లకావత్ నరేష్, బానోత్ బాబు, తేజావత్ దంజ్య, బానోత్ కోటేష్ తదితరులు పాల్గొన్నారు.
