శాస్త్రీయ దృక్పథంతోనే సమాజ అభివృద్ధి సాధ్యం

యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. జ్యోతి....వెల్లడి

Published On
శాస్త్రీయ దృక్పథంతోనే సమాజ అభివృద్ధి సాధ్యం

హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్21
(లోకల్ గైడ్ న్యూస్)

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి, హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని అలవర్చాలని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. జ్యోతి సూచించారు.
. అంతర్జాతీయ శాంతి దినోత్సవ సందర్భంగా సోమవారం ఆర్ట్స్ కళాశాల సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో  ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ
శాస్త్రీయ అవగాహనతోనే సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలు, అపోహలను తొలగించవచ్చని అన్నారు. విద్యార్థులు ప్రతి అంశాన్ని ప్రశ్నిస్తూ, పరిశీలిస్తూ వాస్తవాలను తెలుసుకునే విధంగా ఆలోచనా శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి ఉపయోగించేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు, ఎన్‌ఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కె. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సమాజంలో శాస్త్రీయ ఆలోచనా విధానం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మూఢనమ్మకాలను వీడి ప్రతి విషయాన్ని శాస్త్రీయ ఆధారాలతో పరిశీలించాలని విద్యార్థులకు సూచించారు. తప్పుడు సమాచారం, అపోహలను గుర్తించి వాస్తవాలను తెలుసుకోవడంలో శాస్త్రీయ దృక్పథం కీలకమన్నారు.  ప్రపంచంలో యుద్ధాల వల్ల నష్టాలే తప్ప లాభాలు లేవు అన్నారు.
ఆర్థికశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వి. విజయ్ కుమార్, డాక్టర్ శేషు, డాక్టర్ ఈ. అంజన్ రావు, డాక్టర్ వి. నవీన్, డాక్టర్ ఏ. రవీందర్, డాక్టర్ కళ్యాణి, డాక్టర్ శంకర్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పోషకాహారంతో పసిబిడ్డలకు బలం పోషకాహారంతో పసిబిడ్డలకు బలం
        కారేపల్లి, అక్టోబర్ 3 (లోకల్ గైడ్ న్యూస్ ) : జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శనివారం అవగాహన కార్యక్రమం
నిర్లక్ష్యానికి ఐదుగురు  బలి.. ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి!
అక్టోబర్ 6న ఉస్మానియా కళాశాల వద్ద ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
దివ్యాంగులు, వయోవృద్ధులు, ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తా
వికారాబాద్ బస్సు ప్రమాద బాధితులకు అండగా డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి
ఒంటరి వికలాంగ మహిళకు ‘మీకోసం మేమున్నాం’ అండ
అక్టోబర్ 6న 'మాదిగ విద్యార్థుల ప్రతినిధుల సదస్సు' విజయవంతం చేద్దాం