పేదల దాహార్తికి డా . సంపత్ చేయూత. - బుడగ జంగం కాలనీలో బోరు ఏర్పాటు.

డాక్టర్ సంపత్ కుమార్‌కు కాలనీవాసుల కృతజ్ఞతలు

Published On
పేదల దాహార్తికి డా . సంపత్ చేయూత. - బుడగ జంగం కాలనీలో బోరు ఏర్పాటు.


- 
లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ పట్టణంలోని రెండో వార్డు బుడగ జంగం కాలనీవాసుల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ ఆర్థిక సహకారం అందించారు. ఆయన సహకారంతో శనివారం కాలనీలో బోరు ఏర్పాటు చేశారు.
చాలా రోజులుగా కాలనీలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని బుడగ జంగం వెంకటేష్, మోడెం కృష్ణ డాక్టర్ సంపత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన బోరు ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడంతో పనులు చేపట్టారు. దీంతో తాగునీటి సమస్య కొంతమేర పరిష్కారం కానుండటంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాలనీవాసులు డాక్టర్ సంపత్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి తాగునీటి సమస్య పరిష్కారానికి సహకరించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ప్రజా సంఘం తాండూర్ డివిజన్ కార్యదర్శి బుడగ జంగం వెంకటేష్, సీనియర్ రిపోర్టర్ లక్ష్మణ్, వార్డు కౌన్సిలర్ రమేష్, బుడగ జంగం మోడెం కృష్ణ, మోడెం దత్తు, మోడెం రమేష్, రుద్రాక్షల దస్తప్ప, రుద్రాక్షల బాబు, వానరాసి శేఖర్, శాంతి కుమార్, అంజిలప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత! నర్సంపేటలో గోల్డ్ కంపెనీ సేల్స్‌మెన్‌కు షాక్.. రూ.5.50 లక్షలు ఎగవేత!
    నర్సంపేట క్రైమ్, అక్టోబర్ 14 - లోకల్ గైడ్ : నర్సంపేటలో గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ సేల్స్‌మెన్‌నే బోల్తా కొట్టించి రూ.5.50 లక్షలు ఎగవేసిన ఘటన
వికారాబాద్ జిల్లాలో బార్ల కేటాయింపునకు  (అక్టోబర్ 16న) లాటరీ
కోటమైసమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు!
మంగలి తండాలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ ఉక్కుపాదం!
అర్హత కల్గిన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం.
పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలి.
గ్రామ అభివృద్ధి శిలాపలకాలపై వార్డు మెంబర్ ల పేర్లు నమోదు చేయాలి.