ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.

టియుడబ్ల్యూజే ( ఐజేయు)జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి.

Published On
ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.

 

  నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి.  లోకల్ గైడ్.

 

 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని
 టి యు డబ్ల్యూ జే ( ఐజేయు) జిల్లా అధ్యక్షుడు గార్లపాIMG-20261002-WA0124టి కృష్ణారెడ్డి కోరారు. ఐజేయు పిలుపుమేరకు నల్లగొండలోటి యూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం రామగిరి సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు ఇల్లా స్థలాలతోపాటు ఇల్లు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే హెల్త్ కార్డులు అందించి జర్నలిస్టులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమామిడి మహేందర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి. అశ్వక్ అహ్మద్. అబ్బోజు మదనాచారి చిన్న పత్రికల జిల్లా అధ్యక్షుడు, పిట్టల రామకృష్ణ ప్రధాన కార్యదర్శి, దోటి  శ్రీనివాస్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి, మాదరి యాదగిరి జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు , వంగాల శ్రీనివాసరెడ్డి నల్గొండ డివిజన్ అధ్యక్షుడు, , జిల్లా సంయుక్త కార్యదర్శి జిల్లా యాదగిరి.కె జగదీశ్వర చారి ప్రచార కార్యదర్శి, ఊర రమేష్, ఉయ్యాల లింగయ్య, ఎండి ఖుద్దుస్, దేవరకొండ యాదగిరి, డి సైదులు యాదవ్, చేపూరి రవి, ఎండి సయ్యద్, చింత యాదయ్య, టి దశరథ, సోమచంద్ర శేఖర్, మేకల వెంకట్ రెడ్డి, ఎండి సలీం, టి సత్తిరెడ్డి, కట్ట సుధాకర్, చిలుముల నరేందర్, ఆర్ ఆకాష్, కే శ్రీనివాస్ గౌడ్,   ఎన్ సుధాకర్, బి రామకృష్ణ, ఎన్ నాగరాజు, టి శంకర్, కె నరసింహస్వామి, వెంకట్ రెడ్డి, వినోద్ కుమార్, ఈ సందీప్, కంది సూర్యనారాయణ, వి కిరణ్, బి స్వామి, గంగాధర వెంకటేశ్వర్లు, తిరుమలేష్, చెనగోని గిరిప్రసాద్, గుడిపాటి శ్రీను, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం గాంధీ జయంతి నాడు శ్రీచైతన్య స్కూల్ స్పెషల్ క్లాసులు: -  బిఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం
లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా బ్యూరో: వికారాబాద్ పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై టీఆర్‌ఎస్‌వీ (బిఆర్‌ఎస్‌వీ) జిల్లా అధ్యక్షుడు దీపక్‌రెడ్డి...
ప్రార్థించే పెదవుల్లో కన్నా సహాయం చేసే చేతులు మిన్న  - మానవత్వం 
దళిత నాయకుడి ఎదుగుదలను ఓర్వలేకే అక్రమ కేసులు
మహాత్ముడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శం
మహాత్మునికి ఘనమైన నివాళులు
ఘనంగా గాంధీ ,శాస్త్రీ ల జయంతి వేడుకలు
ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.