క్రీడలతో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం .

జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ను ప్రారంభించిన   జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి.

Published On
క్రీడలతో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం .

 

 

వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి అక్టోబర్ 2:

 యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించే లక్ష్యంతో గాంధీ జయంతి సందర్బంగా పట్టణంలోని అభి ఏరీనా ఇండోర్ స్టేడియంలో జిల్లా యువజన క్రీడల శాIMG-20261002-WA0156ఖ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ ఛాంపియ న్‌షిప్–2026 పోటీలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను  ప్రారంభించారు. కలెక్టర్ బ్యాట్ చేత పట్టి క్రీడలను ప్రారంభించి, కాసేపు ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అంతకుముందు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, జట్టుస్ఫూర్తి వంటి విలువలు పెంపొందుతాయని తెలిపారు.
జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొంటున్న ప్రతి క్రీడాకారుడు గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీపడి తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు. క్రీడాకారు లందరికీ శుభాకాంక్షలు ఆయన తెలిపారు.
జిల్లాలో క్రీడల అభివృద్ధికి, ఇలాంటి క్రీడా పోటీల నిర్వహణకు సహకరిస్తున్న అభి స్పోర్ట్స్ అరేనా నిర్వాహకులు మురళీధర్‌ను కలెక్టర్ అభినందించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
అక్టోబర్ 2 నుంచి 4వ తేదీ వరకు  నిర్వహించనున్న ఈ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో అండర్–15 బాలుర సింగిల్స్, ఓపెన్ పురుషుల సింగిల్స్, ఓపెన్ పురుషుల డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ మినీ స్టేడియం, అభి స్పోర్ట్స్ అరేనా, వనపర్తి వేదికలుగా పోటీలు జరగనున్నాయి. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, తహసిల్దార్ రమేష్ రెడ్డి, అభి స్పోర్ట్స్ అరేనా నిర్వాహకులు డాక్టర్ మురళీధర్, క్రీడాకారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హకీంపేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన.. హకీంపేట్‌లో వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్ల పరిశీలన..
        లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి / కొడంగల్: హకీంపేట్‌లో త్వరలో జరగనున్న వ్యవసాయ అనుబంధ శాఖల ఎక్స్‌పో ఏర్పాట్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. అదేవిధంగా కొడంగల్‌లో
ఐటీసీ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు రహదారి సుందరీకరణకు వారం రోజుల్లో ప్రణాళిక
ధారూర్ నూతన ఎస్‌ఐగా సురేష్ బాధ్యతల స్వీకరణ
ఎస్సై, పోలీస్ ఉచిత శిక్షణకు 100 మంది గిరిజన అభ్యర్థుల ఎంపిక
పేదల జీవితాలకు కొత్త వెలుగు.. డాక్టర్ బాదావత్ రవి సేవా సంకల్పం!
సింగరేణిలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన సారథుల ఎంపిక
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలే లక్ష్యం