- District News
- రైతుల భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
రైతుల భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
మొబిలిటీ వ్యాలీ ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,
ఎన్కతల గ్రామంలో ఏర్పాటు కానున్న 1,100 ఎకరాల మొబిలిటీ వ్యాలీ ప్రాంతాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులను కలిసి వారి సమస్యలు, ఆందోళనలను అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక వాడ కోసం రైతుల నుంచి భూములు తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక రైతులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల భూములకు తగిన పరిహారం అందించేలా చర్యలు తీసుకున్నామని మెతుకు ఆనంద్ తెలిపారు. భూములు తీసుకున్నప్పుడు పరిహారంతో పాటు రైతుల కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మొబిలిటీ వ్యాలీ ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి చేయకుంటే భూములు తిరిగి ఇవ్వాలి..
మోమిన్ పేట్ మండల పరిధిలోని మొబిలిటీ వ్యాలీ ప్రాంతంలో కంపెనీలను తీసుకురావడం, పారిశ్రామిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మెతుకు ఆనంద్ అన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడుతూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లారని మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. అభివృద్ధి అవసరమే అయినప్పటికీ రైతుల ప్రయోజనాలు, భూములకు తగిన పరిహారం, వారి కుటుంబాల భవిష్యత్తును కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. స్థానిక రైతులకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో రైతుల భూములను తిరిగి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు.
రైతులకు న్యాయం చేయాలి..
రైతులకు న్యాయం చేయాలని, వారి భూములకు తగిన పరిహారం అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. పారిశ్రామిక వాడ ఏర్పాటు లక్ష్యంతో భూములు తీసుకున్నప్పుడు ఆ ప్రాంతంలో పరిశ్రమలు, సంస్థలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
పరిశ్రమల ఏర్పాటులో జాప్యం జరిగితే భూములు కోల్పోయిన రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎన్కతల గ్రామ సర్పంచ్ శ్రీకాంత్‌గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్, రంగారెడ్డి జిల్లా మాజీ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు నరసింహారెడ్డి ఎన్కతల గ్రామ వార్డు సభ్యులు పెద్దలు శీలపల్లి నారాయణరెడ్డి
ప్రజలు గ్రామ వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.
