- District News
- ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు ఇద్దరు మృతి..
ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు ఇద్దరు మృతి..
జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) సెప్టెంబర్ 06
జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్–44 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెన్త్ పఠాలం ఎదురుగా ఉన్న హెచ్‌పీ పెట్రోల్ పంప్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది...హైదరాబాద్ నుంచి గద్వాల వైపు వెళ్తున్న కారు..లారీని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మౌనిక, సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు..కారును డ్రైవర్ ముఖేష్ నడుపుతున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు..పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? అతివేగమా.. డ్రైవర్ నిర్లక్ష్యమా.. లేక ఇతర కారణాలా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
