- District News
- దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
పరిగి గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ థామాస్ రెడ్డి. గురుకుల పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.
లోకల్ గైడ్, పరిగి.
దేశ భవిష్యత్తు పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారని పరిగి బాలుర గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ థామాస్ రెడ్డి అన్నారు. శనివారం పరిగిలో గల గురుకుల పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో అత్యంత ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవంను ఘనంగా జరుపుకున్నారు. సర్వే పల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళులు అర్పించారు.ఉపాధ్యాయుల భోదన ద్వారానే నేడు ఘగనతాళంలోకి ఇస్రోలాంటి వ్యవస్థలో విదేశాల కన్న మిన్నగా వినూత్న టెక్నాలజీ వ్యవస్థ లో ముందుకు దూసుకుపోతున్నదని ప్రిన్సిపాల్ థామాస్ రెడ్డి విద్యార్థులతో అన్నారు..ప్రతి విద్యార్ధి డాక్టర్ సర్వే పల్లి రాధాకృష్ణ వంటి మహోన్నతుడిని ఆదర్శంగా తీసుకోని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.ప్రతి విద్యార్థి క్రమశిక్షణ,ఉన్నతమైన నైతిక విలువలను పెంపొందించుకొని విద్యా లో పేరు ప్రఖ్యాతులను పొందాలని కోరారు.విద్యార్థుల సమక్షంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ థామాస్ రెడ్డి, ఉపాధ్యాయులు కృష్ణ కుమార్, రామస్వామి, సుధ, శ్రీకాంత్, పరిమళ,పెంటయ్య తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
