- District News
- Nalgonda
- బైరు మల్లయ్య స్పూర్తితో ప్రజాఉద్యమాలను తీవ్రతరం చేయాలి.
బైరు మల్లయ్య స్పూర్తితో ప్రజాఉద్యమాలను తీవ్రతరం చేయాలి.
6వ వర్ధంతి సభలో సిపిఎం తుమ్మల వీరారెడ్డి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, సిపిఎం సీనియర్ నాయకులు బైరు మల్లయ్య గారి స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం బైరు మల్లయ్య 6వ వర్దంతి నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే ఆయనకు మనం ఆర్పించే ఘనమైన నివాళి ఆన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేయడంలో పోటిపడుతున్నాయని విమర్శించారు.నిత్యవసర వస్తువుల ధరలను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. బైరు మల్లయ్య చివరి వరకు తను నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి నిలకడగా పార్టీ కోసం పని చేశారని గుర్తు చేశారు. గీత కార్మికుల పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియాలను వెంటనే మంజూరు చేయాలన్నారు. గీత కార్మికులకు కాంగ్రెస్ ప్రకటించిన ఎన్నికల హామీలను అమలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వారు గీత కార్మికుల సమస్యలపై కాకుండా వ్యవసాయ కార్మికులు, రైతాంగ సమస్యలపై అనేక పోరాటాలు చేసి ఫలితాలను సాధించారని చెప్పారు.నాటి నకిరేకల్ శాసనసభ్యులు నర్రా రాఘవరెడ్డి సహకారంతో పేదలకు భూముల పంచడంలో, ఇండ్ల స్థలాలను పంపిణీలో కీలకపాత్ర పోషించారు.గీసే వాడికే చెట్టు కావాలని అనేక పోరాటాలు సాధించి టిఎఫ్టిలను సొసైటీలుగా మార్చిన ఘనత వీరికే దక్కిందని అన్నారు.ఆబ్కారీ శాఖ వేధింపులకు వ్యతిరేకంగా గీత కార్మికులు సమీకరించి అనేక ఉద్యమాలు చేశారని చెప్పారు.ఆయన ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ప్రజా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు గంజి మురళీధర్, పి. నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, కొండ వెంకన్న, నలుపరాజు సైదులు, మన్నెం బిక్షం, బొల్లు రవిందర్, కండె యాదగిరి* తదితరులు పాల్గొన్నారు.
