కరెంటు కోతలు ఎత్తివేయాలి

రైతుల ఇబ్బందులు తీర్చాలి 

కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాది నందు నామాజీ 
Published On
కరెంటు కోతలు ఎత్తివేయాలి

నారాయణపేట ఆగస్టు 23:

కరెంట్ కోతలు ఎత్తివేసి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాది నందు నామాజీ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నారా యణపేట నియోజకవ ర్గంలోని రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా కావడం లేదని, ప్రస్తుతం సుమారు 12 గంటల మేర మాత్రమే విద్యుత్ అందు తోందని అన్నారు. అందు లోనూ రెండు, మూడు గంటల పాటు మధ్యలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందని తెలిపారు.
రైతులకు 24 గంటల ఉచి త విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అమ లు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల కారణంగా పంటలకు సాగు నీరు అందించడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. అదేవిధంగా నారాయణ పేట జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతు లు తీవ్ర ఇబ్బందులు పడు తున్నందున జిల్లాను కరు వు జిల్లాగా ప్రకటించి, రైతు లకు తక్షణమే అవసరమై న సహాయాన్ని అందిం చాలని ప్రభుత్వాన్ని కోరారు.రైతుల సమస్యల ను ప్రభుత్వం వెంటనే పరిష్క రించి, నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు 
ఫోటో రైట్ అప్:4.నందు నామాజీ 
____________________

Tags:

About The Author

Latest News