- District News
- తొమ్మిదేళ్లు ఏమి సాధించారు .!!
తొమ్మిదేళ్లు ఏమి సాధించారు .!!
వెయ్యి రోజుల పాలనపై అక్కసెందుకు.!? ---- బీఆర్‌ఎస్ అంటేనే తప్పుడు ప్రచారం..
వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి సెప్టెంబర్ 6:
రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించిన బీ ఆర్ ఎస్ సాధించిందేమిలేదని, సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్న రేవంతన్న సర్కార్ పై విమర్శలు చేయడం తగదని రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క ఘాటుగా విమర్శించారు. శనివారం రాత్రి వనపర్తి పట్టణం లో కాంగ్రేస్ పార్టీ వెయ్యి రోజుల పాలన విజయోత్సవ ర్యాలీ అనంతరం రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆమే మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ అంటేనే తప్పుడు ప్రచారమన్నారు. తొదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేయలేని బీఆర్‌ఎస్, ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి సుమారు రూ.2 వేల కోట్ల చొప్పున అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు . 9 ఏళ్లు బీఆర్‌ఎస్ పాలనలో ఏం చేశారో ఆ పార్టీ నాయకులు
సమాధానం చెప్పాలని ఆమే సవాల్ విసిరారు.
కళ్యాణలక్ష్మి పథకంపై ఎవరో కేసు వేస్తే దానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమే మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకుంటూ కూడా తీసుకోలేదని చెప్పేవారిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని పొందుతూ కూడా తమకు ఏమీ అందలేదని చెప్పేవారికి సంక్షేమ పథకాలను కట్ చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 72 వేల ఉద్యోగాలు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? అని బీఆర్‌ఎస్ నాయకులను సీతక్క నిలదీశారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఉద్యోగ నియామకాలు
చేపడుతున్నామని చెప్పారు. ఇటీవల అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఉద్యోగాలు కల్పించామని, పోలీస్ శాఖలోనూ నియామకాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేశామని గుర్తుచేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వని టీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల రేషన్ కార్డులు, నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లు అందించిందని మంత్రి సీతక్క చెప్పారు. లక్షలాది కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కల్పించి వారి ఇళ్లలో వెలుగులు నింపామన్నారు. ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల సహకారంతో సుమారు రూ.300 కోట్లతో అభివృద్ధి పనులకు బాటలు వేశామని ఆమే వెల్లడించారు .

---- హామ్ ప్రాజెక్ట్ కింద రూ: 70 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన.....
---- ఎమ్మెల్యే మేఘారెడ్డిని అభినందించిన సీతక్క...
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న స్థానిక శాసనసభ్యుడు తూడి మేఘారెడ్డిని ఆమే అభినందించారు. హామ్ ప్రాజెక్టు కింద రూ.70 కోట్లతో పంచాయతీరాజ్ రహదారులను అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడంతో ప్రజలకు రవాణా ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. మహబూబ్‌నగర్ మట్టి బిడ్డలతో, ములుగు బిడ్డలతో తనకు ఆత్మీయ బంధం ఉందని మంత్రి సీతక్క అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని, రానున్న రోజుల్లో మరింత వేగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని ఆమే స్పష్టం చేశారు.
----- వనపర్తిలో వెయ్యి రోజుల కాంగ్రేస్ విజయోత్సవ బైక్ ర్యాలీ ....
కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగాఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం నుంచి భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ , గాంధీ చౌరస్తా మీదుగా చిట్యాల రోడ్డు, భగీరథ చౌరస్తా, వివేకానంద, పొట్టి శ్రీ రాములు, మర్రికుంట వరకు భారీ బైక్ ర్యాలీ తీశారు. అక్కడి నుంచి రాజీవ్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ చేసి అక్కడ కార్నర్ మీటింగ్ నిర్వహించారు . ఈ విజయోత్సవ ర్యాలీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక శాసనసభ్యులు మేఘ రెడ్డి, పార్లమెంటు సభ్యులు మల్లు రవి, వనపర్తి డిసిసి చీఫ్ శివసేన రెడ్డిలతో పాటు వనపర్తి సెగ్మేంట్ లోని కాంగ్రేస్ పా ర్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు.
