- District News
- Khammam
- కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా దారావత్ భద్రు నాయక్
కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా దారావత్ భద్రు నాయక్
పార్టీకి అంకితభావంతో సేవలందించిన సీనియర్ నేతకు దక్కిన గౌరవం
లోకల్ గైడ్ , కారేపల్లి , ఆగష్టు 28 :
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా సింగరేణి మండల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పొలంపల్లి మాజీ సర్పంచ్ దారావత్ భద్రు నాయక్ నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా కొనసాగుతూ, పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న భద్రు నాయక్‌కు జిల్లా కమిటీలో కీలక బాధ్యత అప్పగించడం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. పార్టీని నమ్ముకుని ఎన్ని పరిస్థితులు ఎదురైనా కాంగ్రెస్‌ను వీడకుండా కార్యకర్తలకు అండగా నిలిచిన భద్రు నాయక్, గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ పార్టీకి ప్రజల్లో మరింత ఆదరణ తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. కార్యకర్తల సమస్యలను నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. భద్రు నాయక్‌కు జిల్లా కాంగ్రెస్ కమిటీలో బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆయన చేసిన సేవలకు పార్టీ అధిష్ఠానం గుర్తింపు ఇచ్చినట్లయిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. నూతన బాధ్యతలతో జిల్లా స్థాయిలో పార్టీ కార్యక్రమాల విస్తరణకు, సింగరేణి మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఆయన కృషి చేయనున్నారని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులైన దారావత్ భద్రు నాయక్‌ను భాగ్యనగర్ తండా సర్పంచ్ బానోత్ హీరాలాల్, జిల్లా నాయకులు భీముడు నాయక్, మండల నాయకులు భగవాన్ దాస్, రాందాస్ నాయక్, తారాచంద్, బాబు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హర్ష నాయక్, మండల పార్టీ కోఆర్డినేటర్ గాంధీ, ఉప సర్పంచ్ భిక్కులాల్, ఈర్య నాయక్, మోతిలాల్, మహేష్, సుమ, పద్మ, భూలి, జ్యోతి తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
