ఐక్యంగా పోరాడటమే కామ్రేడ్ సీతారాం ఏచూరికి నిజమైన నివాళి 

సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం 

ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి 74వ జయంతి
Published On
ఐక్యంగా పోరాడటమే కామ్రేడ్ సీతారాం ఏచూరికి నిజమైన నివాళి 

 

 

 

  వైరా ఆగస్టు 12: లోకల్ గైడ్:

ప్రజల హక్కుల పరిరక్షణ కోసం 
 ఐక్యంగా పోరాడటమే కామ్రేడ్ సీతారాం ఏచూరికి నిజమైన నివాళని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు• సీపీఐ(ఎం) మాజీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, కామ్రేడ్ సీతారాం ఏచూరి 74వ జయంతి కార్యక్రమం సీపీఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బోడేపూడి భవనంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి చిత్రపటానికి పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ కామ్రేడ్ సీతారాం ఏచూరి భారత కమ్యూనిస్టు ఉద్యమానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు, లౌకికవాదానికి విశేషమైన సేవలు అందించారని అన్నారు. దేశంలో మతోన్మాద, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేసేందుకు ఆయన నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు. కార్మికులు, రైతులు, పేదలు, మహిళలు, విద్యార్థులు, యువత హక్కుల కోసం సీతారాం ఏచూరి సాగించిన పోరాటానికి గులు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ కోసం మరింత ఐక్యంగా పోరాడటమే కామ్రేడ్ సీతారాం ఏచూరికి నిజమైన నివాళని భూక్యా వీరభద్రం అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా రూరల్ మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు, నాయకులు తోట నాగేశ్వరరావు, తూము సుధాకర్, గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, షేక్ నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, భూక్యా శామ్య, భూక్యా విజయ, దేవబత్తిని వెంకటేశ్వరరావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News