- District News
- దేశ సమగ్రత, ఐక్యతను కాపాడే జనరేషన్‌గా యువత ఎదగాలి:
దేశ సమగ్రత, ఐక్యతను కాపాడే జనరేషన్‌గా యువత ఎదగాలి:
బీజేపీ జిల్లా అధ్యక్షులు డి. నారాయణ.
వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్ట్ 13:
దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశ సమగ్రతను చాటుతూ వనపర్తి పట్టణంలో హర్ ఘర్ తిరంగా యాత్రను భారతీయ జనతా పార్టీ జిల్లా కన్వీనర్ బచ్చు రాములు ఆధ్వర్యంలో జాతీయ జెండాతో భారీ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా

ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు దేశం పట్ల బాధ్యత, జాతీయ భావన, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు.“దేశద్రోహానికి పాల్పడే జనరేషన్‌గా కాకుండా, దేశం కోసం, దేశ సమగ్రతను కాపాడే జనరేషన్‌గా యువత తయారు కావాలి” అని ఆయన పిలుపునిచ్చారు. దేశాన్ని బలంగా, ఐక్యంగా ఉంచడంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలను నేటి యువత గుర్తుంచుకోవాలని సూచించారు. జాతీయ జెండా కేవలం ఒక వస్త్రం కాదని, అది దేశ గౌరవం, స్వాతంత్ర్యం, త్యాగం, ఐక్యతకు ప్రతీక అని తెలిపారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో దేశభక్తి భావాన్ని పెంపొందించడమే లక్ష్యమని,ప్రతి కుటుంబం జాతీయ జెండాను గౌరవంగా ఎగురవేసి దేశ స్వాతంత్ర్య విలువలను గౌరవించాలని ఆయన కోరారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ఐక్యతను కాపాడేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లి, ప్రతి కుటుంబంలో జాతీయ భావాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ, జాతీయ జెండా గౌరవాన్ని కాపాడుతూ దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ---- 80 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ..
---- న్యాయవాదులకు, ఆటో డ్రైవర్లకు జాతీయ జెండాల పంపిణీ...
సుమారు 80 మీటర్ల భారీ జాతీయ జెండాను విద్యార్థులు చేతబట్టి పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీగా సాగి దేశభక్తిని చాటారు. వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల నుంచి ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా యాత్ర వివేకానంద చౌరస్తా, శంకర్‌గంజ్, గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌక్ మీదుగా కొనసాగి శివాజీ చౌరస్తా వద్ద ముగిసింది. ర్యాలీ మార్గమంతా విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని ‘భారత్ మాతాకీ జై’, ‘వందే మాతరం’ వంటి దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా ముందుకు సాగారు. భారీ జాతీయ జెండాతో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీ పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. ర్యాలీ కొనసాగుతున్న సమయంలో ప్రజలు, వ్యాపారులు, యువత, మహిళలు ఆసక్తిగా తిలకిస్తూ జాతీయ జెండాకు గౌరవం తెలిపారు. పలుచోట్ల ప్రజలు ర్యాలీకి మద్దతు తెలుపుతూ దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్ బొక్క బాల్రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతూరి బుడ్డన్న, శ్రీశైలం, మెంటం పల్లి పురుషోత్తం, రామన్న, గారి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు అనుజ్ఞా రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మున్నూరు రవీందర్, కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, శ్రీనివాస్ గౌడ్, కల్పన, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భాషటి శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్ సుమిత్రమ్మ, అలివేలు, 26వ వార్డు కౌన్సిలర్ విజయ్, జిల్లా కార్యదర్శి సూర్యాదవ్, కృష్ణ గౌడ్, సరోజ బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్, అధికార ప్రతినిధి నక్క మహేష్, దాసరాజుల ప్రవీణ్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గంధం ప్రవీణ్, మహిళా మోర్చా నాయకురాలు కవిత, యువమోర్చా అధ్యక్షుడు అరవింద్, మైనార్టీ మోర్చా నాయకుడు ఖలీల్, బత్తిని మధుసూదన్, కంచరవి, మోహన్ సాగర్, తిరుపతయ్య, రాయన్న సాగర్, శివకుమార్, నవీన్, చందు, చిన్న రాయుడు తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
