- District News
- Khammam
- యువతకు అండగా.. ప్రజల్లో మమేకంగా! గుడిపూడి తిరుమల రావు
యువతకు అండగా.. ప్రజల్లో మమేకంగా! గుడిపూడి తిరుమల రావు
రేగులగూడెంలో విఘ్నేశ్వరుని పూజల్లో పాల్గొన్న కాంగ్రెస్ యువ నాయకుడు గుడిపూడి తిరుమల రావు
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 17 (లోకల్ గైడ్ న్యూస్) : ప్రజలతో మమేకమవుతూ.. యువతను ప్రోత్సహిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందిస్తున్న కాంగ్రెస్ యువ నాయకుడు గుడిపూడి తిరుమల రావును రేగులగూడెం గ్రామ ప్రజలు అభినందించారు. మండలంలోని రేగులగూడెం గ్రామంలో కొలువైన విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన గ్రామ ప్రజలు, యువతతో కలిసి పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు యువత చేస్తున్న కృషికి ప్రోత్సాహంగా విగ్రహ ప్రతిష్ఠ కోసం రూ.5,000 ఆర్థిక సహాయం అందించిన తిరుమల రావు.. ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు గ్రామ యువతను అభినందించారు. గ్రామాల్లో యువత చురుగ్గా పాల్గొంటూ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. యువతకు అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందించడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ఉత్సవ కమిటీ యువతతో కలిసి తిరుమల రావు ఆత్మీయంగా మమేకమై కార్యక్రమ వివరాలను తెలుసుకున్నారు. యువతను ప్రోత్సహిస్తూ వారి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలతో కలిసిమెలిసి ఉంటూ వారి కార్యక్రమాలకు సహకరిస్తున్న తిరుమల రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రేగులగూడెం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఆవుల సత్యనారాయణ, దొడ్డ అప్పారావు, దొడ్డ నాగయ్య, నల్లగొర్ల సంపత్, వెంకటరమయ్య, శ్రీను, లక్ష్మణ్ రావు, అచ్చయ్య, పండగ వెంకటేశ్వర్లు, లోయ శ్రీను, పల్లెబోయిన వెంకటేశ్వర్లు, దొడ్డ శివకృష్ణ, ఆవుల కోటయ్య, మురళీకృష్ణ, గంగుల నాగయ్య, సంతోష్, అల్లి నరేందర్ రెడ్డి, నూకల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
