- District News
- గణపతి నవరాత్రి ఉత్సవాలకు జాలిగం రాకేష్‌కు ఆహ్వానం
గణపతి నవరాత్రి ఉత్సవాలకు జాలిగం రాకేష్‌కు ఆహ్వానం
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 16 (లోకల్ గైడ్ ప్రతినిధి):
మెదక్ జిల్లా శివంపేట్ మండలం చిన్న గొట్టిముక్కుల గ్రామంలో నిర్వహించనున్న గణపతి నవరాత్రి ఉత్సవాలకు హాజరై వేడుకల్లో పాల్గొనాలని గ్రామానికి చెందిన బ్రదర్స్ యూత్ సభ్యులు ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జాలిగం రాకేష్‌ను ఆత్మీయంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా బ్రదర్స్ యూత్ సభ్యులు జాలిగం రాకేష్‌ను కలిసి ఉత్సవాల వివరాలను తెలియజేసి, గణపతి నవరాత్రి వేడుకల్లో పాల్గొని యువతను ప్రోత్సహించాలని కోరారు. యువతతో ఆత్మీయ సంబంధాలను కొనసాగిస్తూ, ఐక్యతతో సామాజిక కార్యక్రమాల్లో ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గుమ్మడి శివ, గుమ్మడి రాకేష్, గూడెం శ్రీకాంత్, గుమ్మడి రఘు, భరత్, విజయ్, సాయితేజ, ప్రవీణ్ కుమార్, రాజు, హేమంత్ తదితర బ్రదర్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
