ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి:

Published On
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి:

 

IMG-20261002-WA0164IMG-20261002-WA0163

          ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వనపర్తి జిల్లా నూతన కార్యవర్గాన్ని  మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్ర వారం  తన స్వగృహంలో సన్మానించి అభినందించారు.ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ పేద ప్రజల ఆరోగ్యం పట్ల వరదాయినిగా పనిచేస్తుందని అనేక అత్యవసర సమయాలలో రెడ్ క్రాస్ సంస్థ చూపిన చొరవ అభినందనీయమన్నారు.మానవ సేవయే మాధవ సేవా, రక్తదానం....మహాదానం నినాదాలతో ప్రజలకు రెడ్ క్రాస్ సొసైటీ మరిన్ని సేవలు అందించాలని మాజీ మంత్రి ఆకాంక్షించారు. సన్మానం అందుకున్న వారిలో చైర్మెన్ అమరేందర్, వైస్ చైర్మన్ డా క్టర్ ప్రియాంక, కోశాధికారి సి. జి.విష్ణువర్ధన్, ఎం.సి సభ్యులు వేముల.అమరేందర్, కృష్ణ ఉన్నారు.

--- బీ ఆర్ ఎస్ ఆధ్వర్యంలో  గాంధీ జయంతి వేడుకలు...

 వనపర్తి పట్టణంలో బీ ఆర్ ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యం లో శుక్ర వారం ఘనంగా మహాత్మా గాంధీ జయంతి చేశారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా,పట్టణ అధ్యక్షులు గట్టు యాదవ్,వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్రం సాధించిన జాతిపిత మహాత్మా గాంధీ అని వారు కొనియాడారు. 
 అహింసా,శాంతి,స్వచ్ఛత, గ్రామస్వరాజ్యం ఆశయాల కోసం జీవితాంతం గాంధీ పరితపించారన్నారు . వారి ఆశయాల అనుగుణంగా తెలంగాణ జాతిపిత కె.సి.ఆర్  వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం సాధించారని వారు  కొనియాడారు.మహాత్మా గాంధీ ఆశయాలు ఆచరించడం మన బాధ్యతని, వారి ఆశయ సాధనకు కృషిచెద్దామని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్ పలుస.రమేష్,గౌడ్ నందిమల్ల  అశోక్, రఘుపతి రెడ్డి, పలుసశంకర్ గౌడ్, వెంకట్ సాగర్, సూర్యవంశం.గిరి, నీలస్వామి,గౌడ్ నాయక్,మోహన్ . బి.లక్ష్మయ్య, గంధం.పరంజ్యోతి తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Latest News

గోవిందుతండాలో గాయత్రి దేవికి భక్తి కానుక.. 10 చీరల విరాళం! గోవిందుతండాలో గాయత్రి దేవికి భక్తి కానుక.. 10 చీరల విరాళం!
        కారేపల్లి, అక్టోబర్ 12 (లోకల్ గైడ్ న్యూస్): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిపై భక్తిని చాటుకుంటూ గోవిందుతండాకు చెందిన బానోత్ లచ్చిరామ్–బుజ్జి దంపతులు, వారి
హకీంపేట్ బాధితుడిని మిషన్ హాస్పిటల్లో  పరామర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 
మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్ల భర్తీకి వాక్‌ ఇన్‌ అడ్మిషన్లు
ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర 4 వ మహాసభలు
గోవిందుతండాలో వైభవంగా బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ
ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడి, పాడిన మంత్రి సీతక్క