- District News
- ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్ల భర్తీకి వాక్ ఇన్ అడ్మిషన్లు
ప్రభుత్వ ఐటీఐలో మిగిలిన సీట్ల భర్తీకి వాక్ ఇన్ అడ్మిషన్లు
అక్టోబర్ 13 నుంచి 15 వరకు దరఖాస్తులకు అవకాశం
భద్రాచలం, లోకల్ గైడ్ న్యూస్ :
భద్రాచలం, కృష్ణసాగర్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఆర్‌ఐటీఐ), అధునాతన శిక్షణ కేంద్రం (ఏటీసీ)లో 2026 ఆగస్టు సెషన్‌కు సంబంధించి మిగిలిన సీట్ల భర్తీ కోసం వాక్ ఇన్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు కృష్ణసాగర్ ఆర్‌ఐటీఐ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎన్‌సీవీటీ విధానంలో ఐటీఐ, ఏటీసీ కోర్సుల్లో శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ [https://iti.telangana.gov.in](https://iti.telangana.gov.in) ద్వారా అక్టోబర్ 15వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి రోజు కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా మాత్రమే సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ లాంగ్ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివినట్లు తెలిపే బోనఫైడ్ ధ్రువపత్రాలు, ఐటీఐ సంబంధిత సర్టిఫికెట్లు, బదిలీ ధ్రువపత్రం (టీసీ), ఇతర అవసరమైన ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని, గతంలో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు కొత్తగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు.
ఖాళీల వివరాలు:
1) మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ – ఏడాది వ్యవధి, 13 సీట్లు.
2) బేసిక్ డిజైనర్ వర్చువల్ వెరిఫైయర్ – రెండేళ్ల వ్యవధి, 12 సీట్లు.
3) ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ – ఏడాది వ్యవధి, 16 సీట్లు.
4) ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ – ఏడాది వ్యవధి, 3 సీట్లు.
అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకొని, అవసరమైన ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు కోరారు.
