ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు.

Published On

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు స్థానిక కాంగ్రెస్ నేతలు గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు ఆయన హయాంలోనే భారతదేశం సాంకేతిక విప్లవ రంగంలో అభివృద్ధి సాధించిందని,అంతేకాకుండా దేశ యువత శక్తిని గుర్తించి యువతకు18సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన మహనీయుడు అని అన్నారు.ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్,డిప్యూటీ మేయర్ సల్ల రమ్య,కార్పొరేటర్ తూముల నరేష్,మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి,మంచిర్యాల పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత,లక్షెట్టిపేట్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ,జిల్లా నాయకులు పూర్ణచంద్రరావు,పలువురు కార్పొరేటర్లు,లక్షెట్టిపేట్ కౌన్సిలర్లు,సర్పంచ్లు,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,సింగిల్ విండో డైరెక్టర్లు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,