షాప్ నగర్ లో ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి 

ఘన నివాళులు అర్పించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

 ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీ వేడుకలు 
Published On
షాప్ నగర్ లో ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి 

 

 

 

( లోకల్ గైడ్ షాద్ నగర్ )

భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న  రాజీవ్ గాంధీ  82వ జయంతి సందర్భంగా గురువారం షాద్నగర్  గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి " ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నివాళులు అర్పించారు సద్భావన దివస్" వేడుకలను ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సద్భావన ప్రతిజ్ఞ చేయించారు.
గవర్నమెంట్ హాస్పిటల్ లో బ్రెడ్ పళ్ళు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ "రాజీవ్ గాంధీ  ఆధునిక భారత నిర్మాత. కంప్యూటర్, టెలికాం విప్లవం, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాల అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు ఈరోజు దేశం గర్వంగా చెప్పుకుంటోంది. యువతను ముందుకు తీసుకొచ్చిన నాయకుడు ఆయన" అని కొనియాడారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్,  పెద్ద సంఖ్యలో పాల్గొని రాజీవ్ గాంధీ  ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగునూరి బసవేశ్వరప్ప కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ అలీఖాన్ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా  ప్రధాన కార్యదర్శి ఎండి ఇబ్రహీం కాంగ్రెస్ శ్రేణులు డంగు శ్రీనివాస్ యాదవ్ చెంది తిరుపతిరెడ్డి ముబారక్ అలీ ఖాన్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఖదీర్ కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి శ్రీశైలం గౌడ్ శంకర్ చందు కత్తి చంద్రశేఖరప్ప గంగ లింగారెడ్డి గూడా ఉప సర్పంచ్ అశోక్ సీతారాం తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,