సాంప్రదాయ వైభవంతో గణనాథుడి శోభాయాత్ర.

ఎడ్లబండిపై మట్టి వినాయకుడి ఊరేగింపు

భజన బృందాల ఆధ్యాత్మిక గానాలతో మార్మోగిన తాండూర్
Published On
సాంప్రదాయ వైభవంతో గణనాథుడి శోభాయాత్ర.

లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ పట్టణంలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో గణనాథుడి శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలిచే మట్టి వినాయకుడిని సాంప్రదాయబద్ధంగా ఎడ్లబండిపై ప్రతిష్ఠించి శోభాయాత్ర నిర్వహిస్తున్నారు.
భజన బృందాల ఆధ్యాత్మిక గీతాలు, భక్తుల జైజై నినాదాలతో పట్టణంలో భక్తి వాతావరణం నెలకొంది. సంప్రదాయ పద్ధతులను పాటిస్తూ నిర్వహిస్తున్న ఈ శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యువత, మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి భక్తిశ్రద్ధలతో స్వాగతం పలుకుతున్నారు.
మట్టి వినాయకుడిని ఎడ్లబండిపై ఊరేగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పేలా ఉత్సవ కమిటీ శోభాయాత్రను ఆదర్శప్రాయంగా నిర్వహిస్తోంది. ఆధ్యాత్మికత, సంప్రదాయం, పర్యావరణ పరిరక్షణ కలగలిసిన ఈ శోభాయాత్ర తాండూర్ పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శోభాయాత్రలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి అధ్యక్షురాలు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు, అధికార ప్రతినిధి పర్యాద రామకృష్ణ, కౌన్సిలర్ బాలరాజ్ గౌడ్, కమిటీ సభ్యులు, భక్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.
లోకల్ గైడ్ /తాండూరు:తాండూరు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (టీపీఆర్ఎస్ఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం పట్టణంలోని సాయిమేధా స్కూల్లో ఘనంగా జరిగింది....
రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కల‌కుంట్ల వినోద్ కుమార్ నియామకం .
ఇఫ్తికార్ అహ్మద్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన  దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలి : సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట
శంషాబాద్ సిద్ధేశ్వర్ కాలనీలో విషాదం: మనస్తాపంతో 19 ఏళ్ల యువతి ఆత్మహత్య.
రేబిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్రే బిస్ నివారణకు వ్యాక్సినేషన్‌నే ప్రధాన మార్గం
సమ్మక్క–సారలమ్మ, నాగులమ్మ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలి