తొలి పూజలు అందుకున్న మట్టి గణనాథుడు.

హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు. 

ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి
Published On
తొలి పూజలు అందుకున్న మట్టి గణనాథుడు.

లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ పట్టణంలోని హిందూ ఉత్సవ సమితి కార్యాలయంలో హిందూ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథుడికి తొలి పూజలు సోమవారం ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్‌రెడ్డి హాజరై మట్టి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ నీరజ మాట్లాడుతూ...మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని, ప్రజలు పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని ఆమె సూచించారు.
హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షురాలు నీరజ, గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు, కోశాధికారి అంతారం కిరణ్,సమితి సభ్యులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News