- District News
- Nalgonda
- జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లు అందరికీ శుభాకాంక్షలు.
జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లు అందరికీ శుభాకాంక్షలు.
రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లందరికీ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా డా. బి.ఆర్. అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆర్‌అండ్‌బీ శాఖ ఈఎన్‌సీ లింగారెడ్డి, చీఫ్ ఇంజనీర్లు బి.వి. రావు, ధర్మారెడ్డి, వసంత్ నాయక్, నర్సింగ్ రావు, వనజతో పాటు పలువురు ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజనీర్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసి జాతీయ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకమని, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య క్రమశిక్షణ, అంకితభావం, దూరదృష్టి నేటి తరం ఇంజనీర్లకు స్ఫూర్తిదాయకమని అన్నారు.తెలంగాణలో నాణ్యమైన మౌలిక వసతుల నిర్మాణం ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఇంజనీర్లు అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
