భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు.

రాధిక–కిరణ్ దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

భక్తులకు అన్నదానం నిర్వహించిన ఉత్సవ సమితి - ఉప్పరి స్వరూప–మల్లేశం నిలయం వద్ద వేడుకలు
Published On
భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ప్రత్యేక పూజలు.

లోకల్ గైడ్/తాండూర్:
తాండూర్ పట్టణంలోని 27వ వార్డు కౌన్సిలర్ ఉప్పరి స్వరూప–మల్లేశం నిలయం వద్ద ఏకదంత యూత్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి మంగళవారం సాయంత్రం భక్తిశ్రద్ధలతో రాధిక-కిరణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ  నేపథ్యంలో గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, పుష్పాలు, పండ్లు సమర్పించారు.
పూజా కార్యక్రమంలో గణనాథుడికి అరటిపండ్లు, కొబ్బరికాయ, ఆపిల్, ద్రాక్ష, కమలాపండ్లు తదితర పండ్లతో పాటు పులిహోర, చక్కెర పొంగలి, పాయసం, ఉండ్రాళ్లు, కుడుములు, లడ్డూలు, బూందీ వంటి పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం హారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఏకదంత యూత్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్నదానం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాథుడిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. యువకులు, మహిళలు, చిన్నారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పరిసర ప్రాంతంలో ఆధ్యాత్మిక, భక్తి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఏకదంతా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రవితేజ, సుదర్శన్, ప్రణీత్ , పవన్, శ్రీనాథ్, గొట్టం రాఘవేందర్, కార్తీక్, జగదీష్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. ప్రైవేట్ పాఠశాలల సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.
లోకల్ గైడ్ /తాండూరు:తాండూరు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (టీపీఆర్ఎస్ఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం పట్టణంలోని సాయిమేధా స్కూల్లో ఘనంగా జరిగింది....
రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కల‌కుంట్ల వినోద్ కుమార్ నియామకం .
ఇఫ్తికార్ అహ్మద్‌ను పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు సమర్పించిన  దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలి : సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట
శంషాబాద్ సిద్ధేశ్వర్ కాలనీలో విషాదం: మనస్తాపంతో 19 ఏళ్ల యువతి ఆత్మహత్య.
రేబిస్ నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్రే బిస్ నివారణకు వ్యాక్సినేషన్‌నే ప్రధాన మార్గం
సమ్మక్క–సారలమ్మ, నాగులమ్మ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించాలి