మార్కెట్ సమస్యల అభివృద్ధి కి నిరంతరం కృషి 

మార్కెట్ కమిటీ చైర్మన్ కోట వేణు గౌడ్ 

Published On
మార్కెట్ సమస్యల అభివృద్ధి కి నిరంతరం కృషి 

IMG-20260813-WA0345గండిపేట్, ఆగస్టు 13 లోకల్ గైడ్:

  • మార్కెట్ కమిటీ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ కోట వేణు గౌడ్ అన్నారు. గురువారం బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా నార్సింగి సర్కిల్ కార్పొరేషన్ పరిధిలోని నార్సింగ్ హైట్స్ లోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్ మొదలుకొని ముస్లిం స్మశాన వాటిక వరకు ప్రజల సౌకర్యార్థం  విద్యుత్ స్తంభాల, అండర్ డ్రైనేజ్ పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ప్రజల మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు, నాణ్యతతో పాటు త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయం మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుమార్, ఎ ఈ మణికంఠ, లైన్ ఇన్స్పెక్టర్ రవికుమార్, కాంట్రాక్టర్ శ్రీనాథ్, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags:

About The Author

Latest News