ఎస్టీ–ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గుగులోత్ కిషన్ నాయక్‌కు ఘన సత్కారం

Published On
ఎస్టీ–ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గుగులోత్ కిషన్ నాయక్‌కు ఘన సత్కారం

 

 లోకల్ గైడ్ సెప్టెంబర్ 9 మహబూబాబాద్ 

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటోత్ హుస్సేన్ నాయక్ సూచన
దళిత గిరిజనుల సమస్యలను పరిష్కరించాలి 

జిల్లాలో గిరిజనుల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపు

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ఎస్టీ–ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియామకమైన గుగులోత్ కిషన్ నాయక్ బుధవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటోత్ హుస్సేన్ నాయక్  తన క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వక కలిశారు ఈ సందర్భంలో హుస్సేన్ నాయక్ జిల్లా మనిటరింగ్ కమిటీ సభ్యులు హుస్సేన్ నాయక్ ను  శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా జటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం, విద్య, ఉపాధి, భూమి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ.. సమస్యల పరిష్కారం కోసం గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్టీ–ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ.. అణగారిన వర్గాల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషి చేయాలని  సూచించారు .
ఈ సందర్భంగా గుగులోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో గిరిజనుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తాన్నారు

Tags:

About The Author

Latest News