- District News
- దళితులను అవమానించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి...
దళితులను అవమానించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి...
దళితులు నిరసన తెలిపిన రోడ్లను పసుపు,పాలతో శుద్ధి చేసి దళిత సమాజాన్ని అవమానించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని మాదిగ హక్కుల దండోరా నాయకులు డిమాండ్ చేశారు.బెల్లంపల్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మాదిగ హక్కుల దండోరా పట్టణ అధ్యక్షుడు ఎనగందుల శివాజీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి
మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు హాజరై మాట్లాడుతు స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బాధ్యత తీసుకొని అతని పార్టీ నుండి బహిస్కరించాలని డిమాండ్ చేశారు.మా మాదిగ డప్పులతో రోడ్ల మీదకు వచ్చి శాంతి యుతంగా నిరసన తెలిపితే బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలుదళితులు అంటరాని వాళ్ళు ఆ రోడ్లను మైల పరిచారని ఆ రోడ్లను పసుపునీళ్ళతో,పాలతో శుద్ధి చేసి దళితులను ఆహ్వానించడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఒక దళితుడు ఉన్నత స్థానంలో రాజ్యాంగ బద్ధమైన స్పీకర్ పదవిలో ఉంటే ఓర్చుకోలేని అగ్రకుల దురహంకారులు రాజ్యాంగ బద్ధమైన చట్ట సభలో ఉండి కూడా కనీసం రాజ్యాంగ బద్ధమైన స్పీకర్ కుర్చీని కూడా గౌరవించక పోవడం చోచనీయం అని అన్నారు.ఈ నిరసన కార్యక్రమానికి మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని రాజనర్సు సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు గంగారపు రమేష్,గోగర్ల శేఖర్,దాసరి బానయ్య,ఆరేపల్లి రమేష్,బొగే రాజయ్య,సంగే సారయ్య,మంతెన లింగయ్య,గోగర్ల రమేష్,కడపాక శంకర్,చిలుముల రామకృష్ణ,చెన్నూరు సుధాకర్,గడ్డం నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
