_కొలన్ హనుమంత రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరైన నాయకులు

_కొలన్ సులోచనకు పలువురు నాయకుల నివాళి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

_అంత్యక్రియలకు టీపీసీసీ లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్, మేడ్చల్ మల్కాజ్గిరి.  జిల్లా నాయకులు గ్యార శ్రీనివాస్ హాజరయ్యారు.
Published On
_కొలన్ హనుమంత రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరైన నాయకులు

కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 09 (లోకల్ గైడ్ ప్రతినిధి)

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కొలన్ హనుమంత రెడ్డి మాతృమూర్తి కొలన్ సులోచన గారు స్వర్గస్తులయ్యారు. ఆమె అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, రాజకీయ నాయకుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు హాజరై సులోచన పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.అంత్యక్రియలకు టీపీసీసీ లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్, మేడ్చల్మల్కాజిగిరి జిల్లా నాయకులు గ్యార శ్రీనివాస్ హాజరయ్యారు. సులోచన పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం కొలన్ హనుమంత రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆయనఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు సాబేరా బేగం, బహుజన మహిళా అధ్యక్షురాలు బెల్లంకొండ జ్యోతి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు కొండపల్లి రజిత పటేల్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సీత, మీనా తదితరులు పాల్గొని సులోచనకు నివాళులర్పించారు.
కొలన్ సులోచన మృతి పట్ల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కొలన్ హనుమంత రెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Tags:

About The Author

Latest News