- District News
- ఎస్ఐఆర్ తో సతమతమవుతున్న ప్రజలు..
ఎస్ఐఆర్ తో సతమతమవుతున్న ప్రజలు..
Published On
By Ram Reddy
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ప్రభుత్వాలు చెప్పేది ఒకటైతే ఇక్కడ బిఎల్ఓలు చెప్పేది మరొలా ఉందని ఎంసిపిఐ యు జిల్లా సహాయ కార్యదర్శి పసులేటీ వెంకటేష్ అన్నారు.బుధవారం ఆయన బెల్లంపల్లిలో పార్టీ కార్యాలయంలో మాట్లాడుతు ప్రభుత్వాలు11పత్రాలలో ఏదైనా ఒకటి తీసుకురమ్మని చెబుతుంటే ఎస్ఐఆర్ ప్రక్రియ చేస్తున్న బిఎల్ఓ దగ్గరికి వెళ్లేసరికి ఆ నమూనా పేపర్లో ఆధార్ కార్డు,పాన్ కార్డు లేకున్నా కూడా అదనంగా వారికీ ఇష్టం వచ్చినట్టు అవి తేవాలని,ఇవి తేవాలని ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని పేర్కొన్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా బిఎల్ఓ లకు తగిన సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి ఆరేపల్లి రమేష్ పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
09 Sep 2026 20:29:01
_అంత్యక్రియలకు టీపీసీసీ లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్, మేడ్చల్ మల్కాజ్గిరి. జిల్లా నాయకులు గ్యార శ్రీనివాస్ హాజరయ్యారు.
