- District News
- పాఠశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం.
పాఠశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం.
Published On
By Ram Reddy
కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని గురువారం t తానూర్ మండలం భోసి ఉన్నత పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం విద్యార్థులకు కాళోజీ నారాయణరావు జీవితం, సాహిత్య ప్రస్థానం, తెలంగాణ భాషా సంస్కృతికి ఆయన చేసిన సేవల గురించి తెలుగు ఉపాధ్యాయులు గణేష్ వివరించారు. కాళోజీ రచనల్లో సామాన్య ప్రజల జీవితం, వారి సమస్యలు, తెలంగాణ యాస, భాష ప్రతిబింబిస్తాయని తెలిపారు.
విద్యార్థులు తెలంగాణ భాష గొప్పతనాన్ని చాటుతూ కవితలు, పద్యాలు, ప్రసంగాలు, పాటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ మాండలిక పదాలతో విద్యార్థులు చేసిన ప్రసంగాలు, ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మాతృభాషను, ప్రాంతీయ భాషా యాసలను గౌరవించి, భావితరాలకు తెలంగాణ భాషా సంస్కృతిని అందించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జి రాజశేఖర్, సాహ ఉపాధ్యాయులు రాజేశ్వర్ రెడ్డి, సంజయ్ రావు, సుధాకర్, గణేష్, శ్రీధర్ (పిడి), దృపత్ రెడ్డి,నీల సృజన నవీన్ కుమార్, రవి, శంకర్, కాశీనాథ్, గజేందర్,లు విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
09 Sep 2026 20:29:01
_అంత్యక్రియలకు టీపీసీసీ లేబర్ సెల్ వైస్ ప్రెసిడెంట్, మేడ్చల్ మల్కాజ్గిరి. జిల్లా నాయకులు గ్యార శ్రీనివాస్ హాజరయ్యారు.
