మత్స్య పారిశ్రామిక సంఘం అభివృద్ధికి కృషి చేయాలి: మంత్రి సీతక్క

చైర్మన్ మోపిదేవి వెంకటేశ్వర్‌రావు, పాలకవర్గ సభ్యులకు ఘన సన్మానం  

Published On
మత్స్య పారిశ్రామిక సంఘం అభివృద్ధికి కృషి చేయాలి: మంత్రి సీతక్క

 


 ములుగు జిల్లా లోకల్ గైడ్ 
ములుగు: గత మూడు నెలల క్రితం చల్వాయి ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సంఘం లిమిటెడ్ చైర్మన్‌గా ఎంపికైన మోపిదేవి వెంకటేశ్వర్‌రావు ని, సంఘం పాలకవర్గ సభ్యులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఘనంగా సన్మానించారు.
గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క  చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులతో సమావేశమై సంఘం కార్యకలాపాలు, సభ్యుల సంక్షేమం, మత్స్యకారుల అభివృద్ధి తదితర అంశాలపై మాట్లాడారు.
మత్స్యకార కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి సంఘాలు కీలకంగా పనిచేయాలని, సభ్యుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. సంఘాన్ని మరింత బలోపేతం చేసి, మత్స్యకారులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని పాలకవర్గ సభ్యులను కోరారు. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మోపిదేవి వెంకటేశ్వర్‌రావుకు మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు చింత క్రాంతి, యువజన నాయకులు గొంది కిరణ్, కాడబోయిన రవి, వాసం శ్రావణ్, ఉపాధ్యక్షులు ఈర్ల నరసింహస్వామి, కార్యదర్శి నిమ్మల భాస్కర్, డైరెక్టర్లు దారం రాజు, కుక్కల సమ్మయ్య, పుప్పాల కిరణ్‌కుమార్, బోయిని అయిలయ్య, రేగుల నాగరాజు, మోపిదేవి సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి పేదల పొట్టపై ధరల పోటు.. ఉపాధి హామీ బలోపేతం చేయాలి
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 17 (లోకల్ గైడ్ న్యూస్) : నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతూ పేదల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ధరల
బియ్యంతో శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథుడి ప్రతిష్ట 
అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తెలంగాణ… రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కిలారి సుశీలకు నివాళి
చిరుమర్రి చెరువు వద్ద రూ. 2.90 కోట్లతో పర్యాటక వసతుల అభివృద్ధి
సెప్టెంబర్‌ 17.. పోరాట చరిత్రకు మైలురాయి
ప్రభుత్వ, వైద్య కళాశాల సీట్లు సాధించిన పూర్వ విద్యార్థులకు ఘన సన్మానం