అస్వస్థతకు గురైనా  వారికి మలేరియా, డెంగ్యూ పరీక్షలు  నిర్వహించాలి .

సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టాలి. 

భూసేకరణ, పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగవంతంగా  పూర్తి  చేయాలి. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి 
Published On
అస్వస్థతకు గురైనా  వారికి మలేరియా, డెంగ్యూ పరీక్షలు  నిర్వహించాలి .

వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్ట్ 21:

అస్వస్థతతో ఆసుపత్రుల కు  వచ్చే వారికి మలేరియా, డెంగ్యూ పరీక్షలు తప్పని సరిగా  నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి చెప్పారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోని రామ్‌నగర్ కాలనీలో కలెక్టర్ పర్యటించి ఆరోగ్య సిబ్బంది ఫ్రైడే, డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్న  తీరును ఆయన పరిశీలించారు. 
పట్టణంలో నిరుపయోగంగా ఉన్న పార్కులను గుర్తిం చి అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు .
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.WhatsApp Image 2026-08-21 at 15.31.20
కాలనీలో పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.జ్వరం వంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లు గుర్తిస్తే వారికి మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. దోమల వృద్ధికి అవకాశం లేకుండా నిల్వ నీటిని తొలగించడం, పారిశుద్ధ్య చర్యలను నిరంతరం చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. 

--- రాంనగర్ కాలనీ  పార్క్ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి. 
--- కౌన్సిలర్ బొడ్డుపల్లి  పరుశరాం ...
             
 రామ్‌నగర్( 13 వార్డు) కాలనీ  పార్క్ స్థలంలో  ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ఆ వార్డు కౌన్సిలర్ పరుశరాం జిల్లా కలెక్టర్ ను కోరారు. అందుకు కలెక్టర్  స్పందించి 
పార్క్ లో అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఫైల్ పెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, పట్టణంలో నిరుపయోగంగా ఉండి అభివృద్ధి నోచుకోని పార్కులను గుర్తించి నివేదిక సమర్పించాలని కమిషనర్ కు ఆదేశించారు. తద్వారా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పార్కులను అభివృద్ధి చేయాలన్నారు.

 --- కేడీఆర్ బస్తీ దవఖాన పరిశీలన..

 అనంతరం కేడీఆర్ నగర్‌లోని బస్తీ దవాఖానాను కలెక్టర్ సందర్శించి ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా పాము కాటు, కుక్క కాటు బాధితులకు అవసరమైన మందులు, వ్యాక్సిన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. జ్వరంతో వచ్చే ప్రతి రోగికి అవసరాన్ని బట్టి మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. బస్తీ దవాఖానాలో మందుల నిల్వలు, వైద్య సేవలు, రోగుల వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.

 --- భూసేకరణ, పరిహారం చెల్లింపు చర్య వేగవంతంగా పూర్తి చేయాలి...    

జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ  భూసేకరణ, పరిహారం చెల్లింపు, పునరావాసానికి సంబంధించిన ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  ఆదేశించారు.  హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపు తదితర అంశాలపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెండింగ్ భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.2,800 కోట్లు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టిందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. కొత్త ఆయకట్టు సృష్టించేందుకు వీలుగా పెండింగ్ భూసేకరణ, పునరావాస పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. 

 --- కలెక్టర్ మాట్లాడుతూ...

 వనపర్తి జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ  భూసేకరణ, పరిహారం చెల్లింపు, పునరావాసానికి సంబంధించిన ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పెండింగ్ భూసేకరణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, నీటి పారుదల డిప్యూటీ సీ ఈ వెంకట్ రెడ్డి, ఎస్ ఈ చంద్ర శేఖర్, ఆర్డివో సుబ్రహ్మణ్యంజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, స్థానిక కౌన్సిలర్ పరుశురాం, ఇతర ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,