- District News
- ప్రార్థించే పెదవుల్లో కన్నా సహాయం చేసే చేతులు మిన్న - మానవత్వం
ప్రార్థించే పెదవుల్లో కన్నా సహాయం చేసే చేతులు మిన్న - మానవత్వం
నిలబెట్టుకున్న సుందరి అనిల్:
లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా బ్యూరో :
కరీంపూర్ వాసికి ₹15,000 ఆర్థిక సాయం
కరీంపూర్ (న్యూస్‌లైన్): కరీంపూర్ గ్రామానికి చెందిన కావాలి జంగమ్మ హైదరాబాద్‌లోని నిమ్స్ (నిమ్స్ ) ఆసుపత్రిలో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కరీంపూర్ మాజీ సర్పంచ్, కోట్‌పల్లి BRS మండల పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ గారు, గతంలో ఇచ్చిన హామీ మేరకు వారి ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం ₹15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
బాధితురాలికి పరామర్శ
ఈ సందర్భంగా బార్వాద్ మాజీ సర్పంచ్ వెంకటేష్ యాదవ్‌తో కలిసి సుందరి అనిల్ బాధితురాలిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బాధిత కుటుంబం ధన్యవాదాలు
ఆపద సమయంలో ఆర్థిక సాయంందించి ఆదుకున్న సుందరి అనిల్‌కు బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
