ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ప్రిలిమినరీ పరీక్షకు విశేష స్పందన .

 జిల్లా వ్యాప్తంగా 2,250 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరు – స్క్రీనింగ్ ద్వారా 500 మంది అభ్యర్థుల ఎంపిక .

Published On
ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ప్రిలిమినరీ పరీక్షకు విశేష స్పందన .

 

 


IMG-20260920-WA0078

నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రానున్న ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ అందించేందుకు నిర్వహించిన ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. ఆదివారం నిర్వహించిన ఈ పరీక్షకు 2,250 మంది అభ్యర్థులు హాజరయ్యారు.పరీక్షలో ప్రతిభ కనబరిచిన అర్హులైన అభ్యర్థుల్లో 500 మందిని ఎంపిక చేసి, నల్లగొండ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉచిత శిక్షణ అందించనున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ఎంపికైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఎంతో బాధ్యతగా తీసుకుని క్రమశిక్షణతో శిక్షణకు హాజరై, పట్టుదలతో చదివి, శారీరక దృఢత్వంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోలీస్ ఉద్యోగం కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదని, సమాజానికి సేవ చేసే గొప్ప అవకాశం అని పేర్కొన్నారు.శిక్షణ సమయంలో అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్షతో పాటు సబ్జెక్ట్ నిపుణులతో బోధన, పరీక్షల విధానం, మోడల్ టెస్టులు, సందేహాల నివృత్తి, శారీరక దారుఢ్యానికి అవసరమైన మార్గదర్శకత్వం అందించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ అందిస్తున్న ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంపికైన 500 మంది అభ్యర్థులు పట్టుదలతో శ్రమించి పోలీస్ ఉద్యోగాలు సాధించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకాంక్షించారు.

Tags:

About The Author

Latest News

ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎన్కతల లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
    మోమిన్‌పేట్, సెప్టెంబర్ 01 ( లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో : మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో అర్హులైన పేదలందరికీ త్వరలోనే స్మార్ట్ రేషన్
ఫోన్ మోజులో వైద్యుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పసిపాపల ప్రాణాలతో చెలగాటం
ఆమనగల్లు అభివృద్ధి కోసం ఆచారి ఆమరణ నిరాహార దీక్ష
విద్యార్థులకు సరిపడా బస్సు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు
ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో కమిషనర్‌ పరిశీలన ఏబీసీ, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలపై సమీక్ష
దళితుల,అభ్యున్నతి,సామాజిక రాజకీయ ,చైతన్యం కాంగ్రెస్ తోనే సాధ్యం.... షాద్ నగర్ నియోజక వర్గంలో ఎస్సీ, ఎస్టీలకు సముచిత స్థానం...
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన