దళిత వ్యతిరేకి బీ ఆర్ ఎస్ పార్టీ...అధికారం కోల్పోయామనే అక్కసుతో దళితుల పట్ల సంస్కార హీనంగా ప్రవర్తించిన బిఆర్ఎస్ ఎంఎల్సీ తాత మధు.

గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి.

Published On
దళిత వ్యతిరేకి బీ ఆర్ ఎస్ పార్టీ...అధికారం కోల్పోయామనే అక్కసుతో దళితుల పట్ల సంస్కార హీనంగా ప్రవర్తించిన బిఆర్ఎస్ ఎంఎల్సీ తాత మధు.

 ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 2 ( లోకల్ గైడ్ )

శాసనసభ స్పీకర్ పై పరుష పదజాలంతో దూషించిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాత మధు ని తక్షణమే సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ఎంఎల్సీ తాత మధు దిష్టిబొమ్మను దగ్ధం చేసి చావు డప్పు కొట్టి నిరసన వ్యక్తం చేసిన కాంగ్రేస్ పార్టీ.

*కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర దళిత విభాగం పిలుపు మేరకు గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేరకు ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొంకని విజయ్ మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కించపరిచే మాటలు మాట్లాడుతున్న బిఆర్ఎస్ పార్టీ కి వ్యతిరేకంగా కాంగ్రేస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.

*భారత రాజ్యాంగం కల్పించిన అత్యున్నతమైన పవిత్ర పీఠంపై ఆసీనులై ఉన్న దళిత బిడ్డ…గౌరవ శాసనసభ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్ పై దొరల గడిల బానిస ఎమ్మెల్సీ తాతా మధు ఇష్టానుసారంగ నోరుపారేసుకోవడం బిఆర్ఎస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరికి అహంకారానికి నిదర్శనం...అధికారం కోల్పోయామనే అక్కసుతో ..దళిత నాయకత్వం ఎదుగుతుంటే చూసి ఓర్వలేక రాజ్యాంగ వ్యవస్థలను కించపరిచేలా మాట్లాడటం బిఆర్ఎస్  పార్టీ సంస్కారహీనత కు పరాకాష్ట… స్పీకర్ తల్లిని అవమానించేలా మాట్లాడటం అందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నాం. మనందరం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. ఇలాంటి దుర్మార్గపు పోకడలను నియంత్రించాలి

ఇది అత్యంత తీవ్రమైన నేరం. సభా ప్రాంగణంలో సభాపతి పై అంత అభ్యంతరకరమైన భాష. సభాపతి గారిని, ఆయన కుటుంబ సభ్యులను అవమానిస్తూ మాట్లాడారు. ఇది కేవలం దళితులకు జరిగిన అవమానం కాదు. ఇది అందరికీ జరిగిన అవమానం..ఇది తెలంగాణ చరిత్రలో చీకటి రోజు అని, ఇది కేవలం స్పీకర్ కి కాదు 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన అవమానమని అన్నారు.భారతదేశ చరిత్రలో ఏ చట్టసభల్లోనూ ఇలాంటి దుర్మార్గమైన, హేయమైన సంఘటన జరగలేదని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి సభ్యుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంతటి దుర్మార్గమైన మాటలు ఎవరూ మాట్లాడకూడదు....సభా మర్యాదను కించపరిచిన సభ్యుడిని వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని, ప్రతిపక్ష నాయకులు సభకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు…అసెంబ్లీ కి రాకుండా వారిని ప్రోత్సహించిన బిఆర్ఎస్  ప్రతి పక్షనేత కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు..
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు క్యారగారి శ్రీధర్.కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర నాయకులుకొత్త కురుమ శివకుమార్. రాచర్ల వెంకటేశ్వర్లు.మంకాల దాసు.కొంగర విష్ణు వర్ధన్ రెడ్డి.కాంగ్రేస్ పట్టణ అధ్యక్షుడు గౌస్ పాషా.సింగల్ విండో చైర్మన్ హన్మంత్ రెడ్డి.జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్త కురుమ మంగమ్మ.కౌన్సిలర్స్ నీలం భాను బాబు.దారు రాఘవేందర్...దొంతరమోని భార్గవి రాజు.రామదాస్ నాయక్.మార్కెట్ డైరక్టర్ మహేష్ గౌడ్ , బుగ్గ రాములు .కోడూరు రమేష్.ఈగల రాములు.ఏర్పుల రాజు,సతీష్,సత్య వాణి.ప్రేమ్...రమాకాంత్IMG-20260908-WA0145 రెడ్డి...రామకృష్ణ,యాదవ్.భానుసుమన్.కిరణ్.నగేష్.
అయాన్.ఇమ్రాన్.తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మహిళా ప్రజాప్రతినిధులపై నిర్బంధమా? మహిళా ప్రజాప్రతినిధులపై నిర్బంధమా?
​రింగ్ రోడ్ కూడలిలో ఉద్రిక్తత.. అడ్డుకున్న పోలీసులతో నేతల వాగ్వాదం ​అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన గళం
స్పీకర్‌పై నోరు పారేసుకుంటే.. చట్టం ఊరుకోదు!...అజ్మీర నరేష్ కుమార్ డిమాండ్ 
రైతు వేదికలో సన్న రకాల వరి సాగు నమోదు పత్రాల స్వీకరణ
రాష్టాన్ని  సంక్షోభం లోకి నెట్టిన అసమర్థ కాంగ్రేస్   ప్రభుత్వం .
మట్టి వినాయకుడినే పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం!”
దళిత వ్యతిరేకి బీ ఆర్ ఎస్ పార్టీ...అధికారం కోల్పోయామనే అక్కసుతో దళితుల పట్ల సంస్కార హీనంగా ప్రవర్తించిన బిఆర్ఎస్ ఎంఎల్సీ తాత మధు.
7వ వార్డులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ