మట్టి వినాయకుడినే పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం!”

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

Published On
మట్టి వినాయకుడినే పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం!”

లోకల్ గైడ్
ఆమనగల్లు, సెప్టెంబర్ 8  ఆమనగల్లు:
రాబోయే వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కల్వకుర్తి నియోజకవర్గం, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలు, హానికరమైన రసాయన రంగుల వినియోగం వల్ల చెరువులు, కుంటలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన సంప్రదాయాన్ని, ప్రకృతిని కాపాడుకోవాలంటే స్వచ్ఛమైన మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని సూచించారు.
పూర్వం నుంచి మన పూర్వీకులు మట్టి విగ్రహాలనే పూజించేవారని, మట్టి వినాయకులను పూజించి నిమజ్జనం అనంతరం ఆ మట్టి తిరిగి ప్రకృతిలో కలిసేలా చేయడం ద్వారా భక్తితో పాటు పర్యావరణ బాధ్యతను కూడా నిర్వర్తించినవారమవుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వినాయక చవితి పర్వదినం సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ఆ గణనాథుని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.

Tags:

About The Author

Latest News

మహిళా ప్రజాప్రతినిధులపై నిర్బంధమా? మహిళా ప్రజాప్రతినిధులపై నిర్బంధమా?
​రింగ్ రోడ్ కూడలిలో ఉద్రిక్తత.. అడ్డుకున్న పోలీసులతో నేతల వాగ్వాదం ​అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనపై నిరసన గళం
స్పీకర్‌పై నోరు పారేసుకుంటే.. చట్టం ఊరుకోదు!...అజ్మీర నరేష్ కుమార్ డిమాండ్ 
రైతు వేదికలో సన్న రకాల వరి సాగు నమోదు పత్రాల స్వీకరణ
రాష్టాన్ని  సంక్షోభం లోకి నెట్టిన అసమర్థ కాంగ్రేస్   ప్రభుత్వం .
మట్టి వినాయకుడినే పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం!”
దళిత వ్యతిరేకి బీ ఆర్ ఎస్ పార్టీ...అధికారం కోల్పోయామనే అక్కసుతో దళితుల పట్ల సంస్కార హీనంగా ప్రవర్తించిన బిఆర్ఎస్ ఎంఎల్సీ తాత మధు.
7వ వార్డులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ