- District News
- Khammam
- స్పీకర్‌పై నోరు పారేసుకుంటే.. చట్టం ఊరుకోదు!...అజ్మీర నరేష్ కుమార్ డిమాండ్
స్పీకర్‌పై నోరు పారేసుకుంటే.. చట్టం ఊరుకోదు!...అజ్మీర నరేష్ కుమార్ డిమాండ్
అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి కఠిన చర్యలు తీసుకోవాలి
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై హైదరాబాద్‌లో చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను తెలంగాణ పోలీస్ శాఖ సుమోటోగా స్వీకరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీర నరేష్ కుమార్ డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌పై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా బాధించిందని ఆయన అన్నారు. వివిధ వార్తా మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమైన వీడియోలు, వ్యాఖ్యలను పోలీసులు పరిశీలించి సుమోటోగా కేసు నమోదు చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలను కించపరిచేలా వాట్సాప్, సామాజిక మాధ్యమాల ద్వారా అవమానకర పోస్టులు పెట్టడం, ఇతరుల సమక్షంలో అగౌరవపరచడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణించాలని నరేష్ కుమార్ తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే చట్టపరమైన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ప్రభుత్వం, పోలీస్ శాఖ తక్షణమే స్పందించాలని అజ్మీర నరేష్ కుమార్ కోరారు.
